Begin typing your search above and press return to search.
తనను ట్రోల్ చేసిన వారిని ఇలా కొట్టింది
By: Tupaki Desk | 8 Aug 2021 3:30 PM GMTతెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ నటించిన తిమ్మరుసు మరియు ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాలు వారం గ్యాప్ లోనే బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. కరోనా వల్ల సినిమాలు కమర్షియల్ గా నిరాశ పర్చినా కూడా రివ్యూల పరంగా మాత్రం పర్వాలేదు అనిపించుకున్నాయి. కనుక హీరోయిన్ గా నటించిన ప్రియాంక జవాల్కర్ కు ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆమె తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ ట్యాక్సీవాలా సినిమాతో పరిచయం అయ్యింది. ఆ సినిమాకు ముందు ఈ అమ్మడు కాస్త బొద్దుగా.. ముఖం పై మొటిమలతో విభిన్నంగా ఉంది. ఆ ఫొటోను దొరికించుకున్న నెటిజన్స్ రచ్చ రచ్చ చేశారు. ట్యాక్సీవాలా తర్వాత కూడా ఈమె కాస్త బొద్దుగా అవ్వడంతో నెట్టింట ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి. పెద్ద ఎత్తున తనపై వచ్చిన ట్రోల్స్ కు చాలా బాధ పడ్డట్లుగా ఇటీవల కొన్ని ఇంటర్వ్యూల్లో పేర్కొంది. ఒక అమ్మాయి అనారోగ్యం లేదా ఇతర కారణాల వల్ల లావు అవ్వడం లేదా మొటిమలు రావడం జరిగితే తన తప్పు అవుతుందా.. ఎందుకు ఆమెను విమర్శించాలంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఆమద్య తనను విమర్శించిన వారికి చెంప దెబ్బ అన్నట్లుగా ప్రియాంక జవాల్కర్ ఈ ఫొటోలను షేర్ చేసింది. వరుసగా రెండు సినిమాల్లో అందంగా కనిపించడంతో పాటు ఇప్పుడు అంతకు మించిన నాజూకు అందంతో పాటు పింక్ ఔట్ ఫిట్ మరియు పింక్ స్కిన్ టోన్ తో వావ్ ఎవరు ఈ ముంబయి ముద్దుగుమ్మ అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేసేలా ఉన్నాయి. ప్రియాంక జవాల్కర్ ఈ పిక్స్ తో ఇండస్ట్రీలో మరింత కాలం హీరోయిన్ గా కొనసాగే అవకాశాలు ఉన్నాయని నిరూపితం అయ్యింది. తనను ట్రోల్ చేస్తున్న వారికి ఈ ఫొటోలతో ప్రియాంక జవాల్కర్ సమాధానం చెప్పడం అభినందనీయం. ముందు ముందు ఈ అమ్మడు మరిన్ని ఆఫర్లు దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.