Begin typing your search above and press return to search.
అనంతపురం అమ్మాయికి అవకాశాలు రావట్లేదట!
By: Tupaki Desk | 1 Sep 2019 5:00 AM GMTప్రియాంకా జవాల్కర్ అన్నంతే గుర్తుకు రాకపోవచ్చు. కానీ.. టాక్సీవాలా పోరి అన్నంతనే అమ్మడు కళ్ల ముందు మెదులుతుంది. చూసేందుకు ఉత్తరాది అమ్మాయిలా ఉండటం.. పేరు కూడా సిత్రంగా ఉండటం ఒక ఎత్తు అయితే.. ఈ పోరి.. అసలుసిసలు తెలుగు పిల్ల. తొలి చిత్రంలోనే క్రేజీ యూత్ స్టార్ విజయ్ దేవరకొండతో జత కట్టినప్పటికీ.. అమ్మడికి అదృష్టం వెంట ఉండట్లేదట.
సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావటమే తక్కువ. అలాంటిది ఛాన్స్ వచ్చిన తర్వాత కూడా చెలరేగిపోకుండా ఉండిపోవటం ఏమిటి? అసలేం జరిగింది? మొదటి సినిమా తర్వాత ప్రియాంకా ఎందుకు కనిపించట్లేదన్న ప్రశ్నను ఆమెనే అడిగితే.. ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
ప్రియాంకది అనంతపురం జిల్లా. అదే ఇప్పుడు ఆమెకు శాపంగా మారిందన్న మాట ఆమె నోటి నుంచి వస్తోంది. తొలి సినిమా విడుదలై.. మంచి పేరు వచ్చిన తర్వాత అవకాశాలు రాకపోవటానికి కారణం తెలుగు అమ్మాయిని కావటమే అయి ఉంటుందన్న మాటను చెప్పింది. అదే బాంబే నుంచి వచ్చి ఉంటే మరిన్ని అవకాశాలు వచ్చి ఉండేవని చెప్పటం గమనార్హం.
తెలుగమ్మాయిలకు సరైన గుర్తింపు లేదంటున్న మాటపై ఆచితూచి అన్నట్లు రియాక్ట్ అయిన ఈ బ్యూటీ.. తన సమాధానాన్ని ఆసక్తికరంగా చెప్పింది. తెలుగమ్మాయిలకు అవకాశాలు రావట్లేదన్న మాటలో సగం నిజం.. సగం అబద్ధం ఉందని.. గుర్తింపు ఉంటుంది కానీ ఉత్తరాది భామలతో పోలిస్తే తెలుగమ్మాయిలకు వరుస అవకాశాలు రావటం లేదన్నది నిజమని చెప్పేసింది.
ఎందుకిలా? అన్న ప్రశ్నకు మాత్రం.. తనకూ కారణం తెలీదని.. అలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తెలుగమ్మాయ్ అన్నంతనే ఆసక్తిని చూపిస్తున్న దర్శక నిర్మాతలు.. అవకాశాలు మాత్రం ఇవ్వట్లేదన్నారు. లోపం ఎక్కడ ఉందో అర్థం కావట్లేదన్న ప్రియాంక.. తనను చాలామంది అనంతపురం పిల్ల అని పిలవటం ఆనందంగా ఉందన్నారు.
తన తొలి చిత్రంలో ఇచ్చిన పాత్ర మాదిరి పాత్రలే ఇస్తామని చాలామంది వచ్చారని.. కానీ.. ఒకసినిమాలో చేసిన పాత్ర తరహాలోనే.. అదే పనిగా ఏం చేస్తాం? బోర్ కొడుతుంది కదా? అందుకే ఆలస్యమైనా మరో మంచి పాత్ర చేయాలనే తాను వెయిట్ చేస్తున్నట్లు చెప్పింది.
ముందు.. చేతి నిండా పని ఉన్న తర్వాత.. ఛాయిస్ తీసుకోవటానికి ఉంటుంది కానీ.. తొలుత ఛాయిస్ కే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తే.. పని కోసం ఎదురుచూడాల్సి వస్తుందన్న విషయాన్ని ప్రియాంక ఎందుకు మిస్ అవుతున్నట్లు? ఉత్తరాది బ్యూటీలకు.. తెలుగమ్మాయిలకు మధ్యనున్న ఈ తేడాతోనే ఛాన్స్ లు మిస్ అవుతున్నారా?