Begin typing your search above and press return to search.
ఎట్టకేలకు ఛాన్స్ దక్కించుకున్న ‘టాక్సీవాలా’ హీరోయిన్
By: Tupaki Desk | 2 April 2020 1:30 AM GMT‘టాక్సీవాలా’ మూవీతో ప్రియాంక జవాల్కర్ కుర్రకారు మతిపోగొట్టింది. ‘మాటే వినదుగా’ అనే పాటతో ఈ భామ అందరినీ మెస్మరైజ్ చేసింది. ఈ మూవీ తర్వాత ప్రియాంక జువాల్కర్ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని అందరూ భావించారు. అయితే ఇందుకు భిన్నంగా ఈ సినిమా తర్వాత ఈ అమ్మడికి అవకాశాలేమీ రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. అయినప్పటికీ ఈ భామ కుంగి పోకుండా సోషల్ మీడియా లో తన హాట్ హట్ ఫొటోలను షేర్ చేస్తూ అందరి అటెన్షన్ ను తనవైపు తిప్పుకుంది. దీంతో ఎట్టకేలకు ఈ అమ్మడికి సినిమా ఆఫర్ దక్కింది.
శ్రీధర్ గాదె అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించే మూవీలో ప్రియాంక జువాల్కర్ ఛాన్స్ దక్కించుకుంది. ఈ మూవీలో ‘రాజాగారు రాణివారు’ ఫేం కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నాడు. ‘ఎస్ఆర్ కల్యాణ మండపం ఈస్ట్-1975’గా ఈ మూవీ టైటిల్ ఖరారైంది. ‘టాక్సీవాలా’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ప్రియాంక జవాల్కర్ ఈ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతుంది. తాజాగా కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీలో డైలాగ్ కింగ్ సాయికుమార్, తులసీ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఈ మూవీని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్నారు. కల్యాణ మండపం చుట్టూ తిరిగే కథాంశంతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీని ఎలైట్ ఎంటటైన్మెంట్ బ్యానర్లో నిర్మిస్తుండగా చేతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.