Begin typing your search above and press return to search.

ప్రియాంక మోహన్.. గ్లామర్ డోస్ పెంచుకుండానే.. ఊహించని లుక్

By:  Tupaki Desk   |   25 July 2022 11:30 AM GMT
ప్రియాంక మోహన్.. గ్లామర్ డోస్ పెంచుకుండానే.. ఊహించని లుక్
X
గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిపోయిన బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంక మోహన్ అప్పుడప్పుడు కాస్త గ్లామర్ షో తో కూడా ఎందుకనో ఆకట్టుకొని ప్రయత్నం చేస్తుంది. ఈ బ్యూటీ మొదటి చూపులోనే పక్కింటి అమ్మాయి తరహాలో చాలా హోమ్లీ గా దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. ఒక విధ్యక్మెగా గ్యాంగ్ లీడర్ సినిమాలో నాని కి జోడిగా ఆమె షాక్ ఇచ్చింది అని చెప్పాలి.

ట్రెడిషనల్ లుక్ లోనే కనిపిస్తూ మతి పోగొట్టేసింది అమ్మాయిలు మరి ఇంత అందంగా ఉండడం చాలా క్రైమ్ అంటూ నాని డైలాగ్ కూడా కొట్టేసాడు. ఇక ఆ సినిమా తర్వాత బ్యూటీకి చాలా మంచి క్రేజ్ అందినప్పటికీ పెద్దగా అవకాశాలను అయితే అందుకోలేకపోయింది. అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను కాకుండా ప్రియాంక విభిన్నమైన కథలను ఎక్కువగా సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.

ఇక ఈ బ్యూటీ అప్పుడప్పుడు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్న పోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. రీసెంట్ గా తెల్లని టీ షర్ట్ బ్లాక్ ప్యాంట్ లో అమ్మడు చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది.

చాలా సింపుల్ గా కనిపించినప్పటికీ కూడా ప్రియాంక ఏదో మాయ చేస్తుంది అని సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా పాజిటివ్గా స్పందిస్తున్నారు తన చిరునవ్వుతోనే ఎంతగానో ఆకట్టుకునే ప్రియాంక మోహన్ రాబోయే రోజుల్లో మరిన్ని విభిన్నమైన సినిమాల్లో నటించబోతున్నట్లు ఆ మధ్య ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది.

ఇక తెలుగులో ఆమె చేసిన రెండవ సినిమా శ్రీకారం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయినప్పటికీ తమిళంలో మళ్లీ వెంటనే డాక్టర్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే.

అలాగే సూర్య ET సినిమాలో కూడా ఒక మెయిన్ హీరోయిన్ గా నటించిన ప్రియాంక మోహన్ ఆ తర్వాత మరోసారి శివకార్తికేయన్ డాన్ సినిమాలో వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది . ఇక ఇప్పుడు ఈ తరహాలో ఆకట్టుకుంటున్న ప్రియాంక మోహన్ సోషల్ మీడియాలో మరో స్పెషల్ ఇంటరర్వ్యూ ఇవ్వడానికి రెడీ అవుతోందట.