Begin typing your search above and press return to search.
పబ్లిక్ లో ఆ సరసమేల కన్నా?
By: Tupaki Desk | 4 Dec 2018 8:19 AM GMTపబ్లిక్ లో ప్రేమికులు ముద్దాడేయడం.. ప్రేమగా ఆలింగనం చేసుకోవడం అన్నది పాశ్చాత్య దేశాల్లో చాలా సహజం. కానీ అదే సీన్‌కి మన దేశంలో అనుమతి ఉందా? అంటే ఇంకా రైట్స్ రిజర్వుడ్ చేయలేదనే చెప్పొచ్చు. పార్కుల్లో ప్రేమికులు ముద్దాడుకుంటే పోలీసులు కటకటాల్లో వేస్తారు. పబ్లిక్ లో ముద్దాటలు సహించరు. నచ్చిన చెలికత్తె లేదా ప్రియురాలిని లేదా భార్యను పార్కుల్లోనూ, పబ్లిక్‌లోనూ ఓపెన్ గా అందరూ చూస్తుండగా ముద్దాడేస్తామంటే ఒప్పుకోని సమాజం ఇప్పటికీ ఉంది. అదేదో వింతలాగా, వ్యభిచారం లాగా చెప్పుకునే జనాలు మనకు ఉన్నారు. కొందరైతే మనోభావాలు పేరుతో కేసులు కూడా పెట్టేస్తారు.
కానీ ఈయనేంటి? ఇలా సిగ్గు ఎగ్గు లేకుండా వైఫ్ తో అలా పబ్లిక్ లోనే సరసం ఆడేస్తున్నాడు. ఐ లవ్ యు అని చెవిలో చెప్పేందుకు నడుము పై చెయ్యి వేసి వెస్ట్రన్ స్టైల్లో దగ్గరకు లాక్కున్నాడు. లక్షలాది మంది వీక్షించే లైవ్‌ల సాక్షి గా నిక్ జోనాస్ తన భార్యామణి ప్రియాంక చోప్రాతో పబ్లిక్ లో రొమాన్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అది పాశ్చాత్య దేశాల్లో ఓకే కానీ, ఇక్కడ ఓకేనా? అన్న ప్రశ్న తలెత్తింది ఆ సందర్భంలో. సెలబ్రిటీల వరకూ ఏమైనా డిస్కౌంట్ ఉందా? అన్న ముచ్చటా యూత్‌లో సాగుతోంది.

డిసెంబర్ 1 - 2 తేదీల్లో ఉమైద్ భవన్లో పెళ్లాడుకున్న ఈ జంట అటు పై జోధ్ పూర్ విమానాశ్రయంలో ఇలా దర్శనమిచ్చారు. పీసీ పచ్చ రంగు సవ్యసాచి చీరలో సంప్రదాయబద్ధంగా కనిపిస్తే ఖాకీ చొక్కా, ఫ్యాంటులో నిక్ జోనాస్ వెరైటీగా కనిపించాడు. ఆ జోడీ అందరి ముందూ పరాచికం ఆడుకున్న వైనం చర్చకు తావిచ్చింది. జోధ్‌పూర్ నుంచి కొత్త జంట దిల్లీకి బయల్దేరే వేళ సన్నివేశమది. రెండ్రోజుల పెళ్లిలో ఒక పెళ్లి హిందూ సాంప్రదాయం ప్రకారం, ఇంకో పెళ్లి క్రిస్టియన్ (వరుడి ఫ్యామిలీ నిబంధన) స్టైల్లో సాగింది. మొత్తానికి కొత్త జంట పెళ్లి హాట్ టాపిక్. ఈ జంట వ్యవహారం పై ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్స్ పైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ దృశ్యం చూశాక పబ్లిక్‌లో ఆ సరసమేల కన్నా? అంటూ సెటైర్లు పడుతున్నాయ్. ఇది ఇండియా బాబూ.. ఏం చేసినా చాటునే చేయాలి..! అంటూ చెవులు కొరుక్కుంటున్నారు.