Begin typing your search above and press return to search.

మిస్ వరల్డ్‌ కిరీటం అందుకున్న వెంటనే సర్జరీ.. ఫేస్‌ మారిపోయి ఛాన్స్ మిస్‌

By:  Tupaki Desk   |   4 May 2023 9:04 PM GMT
మిస్ వరల్డ్‌ కిరీటం అందుకున్న వెంటనే సర్జరీ.. ఫేస్‌ మారిపోయి ఛాన్స్ మిస్‌
X
బాలీవుడ్‌ లో హీరోయిన్‌ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రస్తుతం హాలీవుడ్ లో స్టార్ గా వెలుగు వెలుగుతున్న ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా. తాజాగా ఈమె హాలీవుడ్ సిరీస్‌ సిటాడెల్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం సిటాడెల్‌ సిరీస్‌ తెగ సందడి చేస్తోంది.

సిరీస్‌ స్ట్రీమింగ్ కు ముందు నుండి ఇప్పటి వరకు ప్రియాంక చోప్రా తెగ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉంది. ప్రతి రోజు ఏదో ఒక వార్త తో మీడియాలో ప్రియాంక చోప్రా నిలుస్తోంది. ఇటీవల అమెరికా వెళ్లిన కొత్తలో తాను స్నాక్స్ ను బాత్‌ రూం లో తిన్నట్లుగా చెప్పింది. తాజాగా తాను డిప్రెషన్‌ కి గురి అయిన విషయాన్ని చెప్పుకొచ్చింది.

ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్‌ కిరీటం అందుకున్న కొద్ది సేపటికే శ్వాస తీసుకోవడంకు చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాను. దాంతో వెంటనే ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యాను. తన సమస్యను గుర్తించిన వైద్యులు వెంటనే ఆపరేషన్‌ చేయాలని సూచించారు.

తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ కు సిద్ధం అయ్యాను. సర్జరీ తర్వాత తన ముక్కు షేప్‌ చాలా మారింది. దాంతో పాటు తన ఫేస్ మొత్తం కూడా మారింది. అలా తనకు వచ్చిన కొన్ని సినిమాల ఆఫర్లు కూడా చేజారి పోయాయి. కొన్నాళ్ల తర్వాత మళ్లీ ముక్కు సర్జరీ చేయించుకుని మునుపటి రూపం కి వచ్చాను అంది.

సర్జరీ సమయంలో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా పేర్కొంది. తన ఫేస్ మారి అందం పోవడంతో డిప్రెషన్ కి వెళ్లి పోయాను. ఆ సమయంలో నాన్న నాకు చాలా ధైర్యంగా నిలిచారు. ముక్కు సరిగా లేని సమయంలోనే అనిల్ శర్మ నాకు ఒక పాత్ర ఇచ్చి ప్రోత్సహించాడు. ఆయన వల్లే ప్రియాంక చోప్రా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆయన అంటే పీసీకి ప్రత్యేకమైన అభిమానం గా ఎప్పటికీ చెబుతూనే ఉంటుంది.