Begin typing your search above and press return to search.
సరోగసీలో తొలి బిడ్డకు మమ్మీ అయిన పీసీ
By: Tupaki Desk | 22 Jan 2022 4:08 AM GMTకెరీర్ పరంగా ఎంత బిజీ లైఫ్ ఉన్నా.. సంసారం పిల్లల్ని కనడం వగైరా చాలా ఉంటాయి. లైఫ్ డ్రామాలో కొన్నిటిని వాయిదా వేయడం కుదరదని పెద్దలు చెబుతారు. అందుకేనేమో.. ప్రియానిక్ జంట తమ ప్రణాళికను మార్చుకున్నారు. ఇప్పటికిప్పుడు సరోగసీ ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఇన్నాళ్ల సైలెన్స్ ని బ్రేక్ చేశారు పీసీ-నిక్ జంట.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా శుక్రవారం రాత్రి తాను భర్త నిక్ జోనాస్ తో కలిసి సరోగసీ ద్వారా బిడ్డను స్వాగతించామని వెల్లడించారు. పీసీ తన కుటుంబంపై దృష్టి పెడుతున్నానని.. ఈ ప్రత్యేక సమయంలో గోప్యత కావాలని కోరారు. ప్రియాంక - నిక్ లకు ఇది మొదటి సంతానం. వారు 2018లో వివాహం చేసుకున్నారు. నిక్ ను ట్యాగ్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ను పంచుకుంటూ ప్రియాంక ఇలా రాశారు.
``మేము సర్రోగేట్ ద్వారా బిడ్డను స్వాగతించామని ధృవీకరించినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఈ ప్రత్యేక సమయంలో మేము మా కుటుంబంపై దృష్టి కేంద్రీకరిస్తున్నందున మేము గౌరవంగా గోప్యత కోసం అడుగుతాము. చాలా ధన్యవాదాలు`` అని అన్నారు. నిక్ జోనాస్ కూడా తన సోషల్ మీడియా పేజీలో అదే పోస్ట్ ను పంచుకున్నాడు.
అంతకుముందు 2021లో ఓప్రా విన్ ఫ్రేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిక్ తో కుటుంబాన్ని ప్రారంభించడం గురించి అడిగినప్పుడు ప్రియాంక పిల్లల్ని కనడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ``మీకు తెలుసా మీరు దేవుడిని నవ్వించాలని .. మీ ప్రణాళికలను ఆమెకు చెప్పాలనుకుంటున్నారు. ఆ ప్రణాళికలను రూపొందించేది నేను కాదు.. కానీ అవును ఖచ్చితంగా...! అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇది సరైన సమయం అయితే మేము ఖచ్చితంగా పిల్లల్ని కోరుకుంటున్నాం! అని వ్యాఖ్యానించింది. దేవుడు తమకు పిల్లల్ని ఇవ్వాలన్న మాటను పీసీ అప్పుడు అన్నారు. అయితే ఇంతలోనే సరోగసీ ద్వారా తొలి కిడ్ ని కంటున్నామని గ్లోబల్ స్టార్ ప్రకటించారు.
ఈ జనవరిలో వానిటీ ఫెయిర్ ఇంటర్వ్యూలో పీసీ ఏమన్నారంటే..``మన భవిష్యత్తు కోరిక ఆకాంక్షల్లో వారు (పిల్లలు) పెద్ద భాగం. దేవుని దయతో అది జరిగినప్పుడు జరుగుతుంది. మాతృత్వం కలిగితే ఆ తర్వాత కెరీర్ లో నెమ్మదిస్తారా? అని ప్రియాంకను అడిగినప్పుడు.. ``నేను దానికి ఓకే. దానితో మేమిద్దరం ఓకే..`` అని కూడా అన్నారు. తన భర్తకు ఎలాంటి అభ్యంతరం లేదనేది పీసీ క్లారిటీగా చెప్పారు.