Begin typing your search above and press return to search.

18 ప్రాయంలో పీసీ బికినీ..ఫైర్ అయిన హ‌బ్బీ!

By:  Tupaki Desk   |   10 Jun 2022 1:30 PM GMT
18 ప్రాయంలో పీసీ బికినీ..ఫైర్ అయిన హ‌బ్బీ!
X
గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక‌చోప్రా హాలీవుడ్ కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతుంది. నిక్ జోనాస్ తో జీవితాన్ని పంచుకున్న త‌ర్వాత కెరీర్ మ‌రింత వెలుగులు జిమ్ముతుంది. హాలీవుడ్ స్టార్ అయింది. అంత‌కు మించి అమెరికా కోడ‌లుగా వెలిగిపోతుంది. పుట్టింట భార‌త్ లో ఎప్పుడు ఘ‌న స్వాగ‌త‌ముంటుంది. ఇంత‌కు మించి జీవితానికి ఏం కావాలి. వృత్తి..వ్య‌క్తిగ‌తంగా ఎంతో సాపీగా సాగిపోతుంది.

కానీ ఎందుక‌నో పీసీకి ఒక్క‌సారి అలా గ‌తంలోకి తోంగి చూడాల‌నిపించిందో! ఏమో కానీ ఓహాట్ ఫోటోతో ఇప్పుడు కుర్ర‌ళ్ల‌లో ప్ర‌కంప‌న‌లు రేపింది. ఇదిగో ఇక్క‌డిలో 18 ప్రాయంలో బికినీ వేసిన ఫోటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి స‌ల‌ప‌రం పుట్టిస్తుంది. నాటి మోడ‌లింగ్ రో జుల్ని గుర్తు చేసుకుని పీసీ ఇలా కుర్రాళ్ల‌లో కాక‌లు రేపుతుంది.

డ్రాప్ డెడ్ గార్జియ‌స్ బ్రౌన్ క‌ల‌ర్ బికినీలో అగ్గి రాజేస్తుంది. స‌రిగ్గా 22 ఏళ్ల క్రితం 2000 సంవ‌త్స‌రంలో సిర్కా న‌వంబ‌ర్ 2000 క్యాలెండ‌ర్ గాళ్ల్ గా ఇలా క‌నువిందు చేసింది. బ‌క్క ప‌ల‌చ‌ని శ‌రీరసౌష్ట‌వం.. లేలేత ప్రాయంలో అమ్మ‌డు ఏ రేంజ్ లో క‌వ్విస్తుందో మాట‌ల్లో చెప్ప‌లేనిది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట దుమారం రేపుతుంది.

ఫోటో పాతదే అయినా గ్లోబ‌ల్ స్టార్ దుమారం మామూలుగా లేదు. ఈ ఫోటోని చూసి రోజూ పీసీని త‌నివి తీరా చూసే హ‌బ్బీ నిక్ జోనాస్ సైతం కామెంట్ చేయ‌కుండా ఉండ‌లేక‌పోయాడు. భ‌గ భ‌గ‌ మండుతోన్న ఫైర్ ఏమోజీని పోస్ట్ చేసి మ‌రింత మంట రేపాడు. ఇటీవ‌లి కాలంలో రెగ్యుల‌ర్ లుక్ లో పీసీని చూసి బోర్ కొట్టిన జ‌నాల‌కి 18 ఏళ్ల ప్రాయం పిక్ కొత్త ఫీల్ ని అందిస్తుంది. ఈ ఓల్డ్ పిక్ ని త‌నివి తీరా చూసి ఆస్వాదించ‌డం నెటి జ‌నుల వంత్తైంది.

ఇక ప్రియాంక చోప్రా సినిమాల విష‌యానికి వ‌స్తే 'సీటాడెల్' వెబ్ సిరీస్ లో న‌టిస్తోంది. ఇటీవ‌లే కొన్ని ఫోటోలు లీకై సంచ‌ల‌నం రేపాయి. అలాగే బాలీవుడ్ లో ప‌ర్హ‌న్ అక్త‌ర్ తో క‌లిసి 'జీలే జ‌రా'లో న‌టిస్తోంది.

ఈ రెండు గాక హిందీలో కొత్త ప్రాజెక్ట్ ల‌కు సంబంధించి చ‌ర్చ‌లు వేగంగా జ‌రుపుతుంద‌ని స‌మాచారం. హాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ ఏక కాలంలో సినిమాలు చేయాలి అన్న నిబంధ‌న‌తో ముందుకు సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవ‌లే స‌రోగ‌సి విధానం ద్వారా ఓ బిడ్డ‌కి త‌ల్లిగాను మారిన సంగ‌తి తెలిసిందే.