Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: మమ్మీ రిటర్న్స్ లా పీసీ ఏంటా ఫోజు?
By: Tupaki Desk | 25 May 2021 12:30 PM GMTఒక్కోసారి యాథృచ్ఛికమే అయినా కానీ ఫలానా హీరోయిన్ ని ఇమ్మిటేట్ చేసినట్టుగా ఉంది! అంటూ అభిమానులు నవతరం నాయికల ఫ్యాషన్స్ ని తరచి చూస్తారు. ఫలానా సినిమాలో ఫలానా నటి ఇలాంటి దుస్తులనే ధరించింది అంటూ పోల్చి చూడడం సహజం.
ఫ్యాషన్ ప్రపంచపు పోకడల్లో ఎవరైనా డిజైనర్ ని ఇంప్రెస్ చేసిన ఒక ఎంపికకు సరికొత్త సృజనాత్మకత యాడప్ అయ్యి కొత్త డిజైన్ పుట్టుకొస్తుంది. ఇదిగో మమ్మీ రిటర్న్స్ లో నటించిన ది గ్రేట్ సూపర్ మోడల్ పత్రిషియా వెల్సాకూజ్ ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఈజిప్ట్ టోంబ్ (సమాధి)లో శాపం అనుభవించే గొప్ప ప్రేమికురాలిగా ఈ విదేశీ నటి పెర్ఫామెన్స్ అబ్బురపరుస్తుంది. ఆ పాత్రకు డిజైన్ చేసిన దుస్తులు వరల్డ్ క్లాస్.. ఇప్పుడు అవే దుస్తుల స్ఫూర్తితో కాస్త ట్రెడిషనల్ లుక్ లో పీసీని ఆవిష్కరించారా? అన్న సందేహం కలగక మానదు.
ప్రఖ్యాత బిల్ బోర్డ్ పురస్కారాల వేదికపై భర్త నిక్ తో కలిసి ప్రియాంక చోప్రా మెరుపులు మెరిపించారు. ఇక ఈ వేదికపై పీసీ ఎంపిక చేసుకున్న డిజైనర్ లుక్ ప్రత్యేకంగా హైలైట్ అయ్యింది. పీసీ థై స్లిట్ డ్రెస్ లో అందాల్ని ఆరబోసిన తీరు యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. గోధుమ వర్ణం శరీరఛాయతో కనిపిస్తున్న పీసీకి ఇంచుమించు శరీర రంగులోనే కలిసిపోయే కలర్ తో గోల్డెన్ క్రిస్టలైన్ డిజైన్ తో అద్భుతాలు సృష్టించారు డిజైనర్. ఈ లుక్ ఫెంటాస్టిక్ అంటూ అభిమానుల నుంచి కితాబు అందుకుంటోంది.