Begin typing your search above and press return to search.
మేకింగ్ వీడియో: అనుబంధాల మజిలీ
By: Tupaki Desk | 4 April 2019 12:40 PM GMTఇంకో పన్నెండు గంటల కంటే తక్కువ సమయంలో థియేటర్లలో అడుగు పెట్టబోతున్న మజిలీ మీద హైప్ బాగానే ఉంది. అడ్వాన్సు బుకింగ్స్ జోరుగా ఉండటం చూస్తుంటే ప్రేక్షకులు దీని మీద ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థమవుతోంది. పరిమితంగా విడుదల చేసిన సెంటర్స్ కొన్ని చోట్ల స్క్రీన్లు పెంచే పరిస్థితి ఉందంటేనే హైప్ ని అర్థం చేసుకోవచ్చు.
వరస ఇంటర్వ్యూలతో ప్రమోషన్ ని స్టడీగా మైంటైన్ చేస్తున్న మజిలి టీం తాజాగా ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఆల్బంలోనే బెస్ట్ అండ్ ఫీల్ గుడ్ సాంగ్ గా పేరు తెచ్చుకున్న ప్రియతమా ప్రియతమా పాటను షూట్ చేసిన విధానాన్ని ఇందులో పొందుపరిచారు .హీరో నాగ చైతన్య హీరొయిన్ సమంతాలపాటు దర్శకుడు శివ నిర్వాణ గీత రచయిత చైతన్య ప్రసాద్ గాయని చిన్మయి ఈ పాట తాలుకు అనుభవాలను ప్రత్యేకంగా పంచుకున్నారు.
వీడియోలో సమంతా చైతుల మధ్య ఎక్కడెక్కడ షూట్ చేసింది ఎవరెవరు ఇందులో ఉన్నది అలా చూపించి చూపించకుండ వదిలేశారు. క్యురియాసిటి పెంచడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. స్లో మెలోడీ అయినప్పటికీ ఈ సాంగ్ హీరో హీరొయిన్ల మధ్య లవ్ ట్రాక్ కాదు. వివిధ రకాల విజువల్స్ తో సినిమాలోని ఈ జంట జీవితానికి సంబంధించి కీలకమైన సీన్స్ ఉంటాయి. అందులోనూ సమంతా పోషించిన పాత్ర కోణం నుంచి వచ్చే పాట కాబట్టి ఇంకొంచెం డెప్త్ ఎక్కువగా ఉంది. అనుబంధాలను హై లైట్ చేస్తూ సాగే ఈ ప్రియతమా ప్రియతమా మేకింగ్ వీడియో చూస్తే మీకే ఓ క్లారిటీ వచ్చేస్తుంది