Begin typing your search above and press return to search.

యంగ్‌ హీరో మూవీ ప్రొడక్షన్‌ టీమ్‌ పై కేసు నమోదు

By:  Tupaki Desk   |   17 Oct 2020 3:30 AM GMT
యంగ్‌ హీరో మూవీ ప్రొడక్షన్‌ టీమ్‌ పై కేసు నమోదు
X
ఒరేయ్‌ బుజ్జిగా సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజ్‌ తరుణ్‌ ప్రస్తుతం తన తదుపరి సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు. ఇంకా టైటిల్‌ ఖరారు కాని ఆ ప్రాజెక్ట్‌ షూటింగ్‌ ను ఉప్పల్‌ లోని బ్యాంకు కాలనీలో నిర్వహించారు. గత రెండు రోజులుగా అక్కడ షూటింగ్‌ జరుపుతుండగా పోలీసులు అక్కడకు చేరుకున్నారు. షూటింగ్‌ కారణంగా ఎక్కువ సంఖ్యలో జనాలు గుమ్మి కూడుతున్నారు.

లాక్‌ డౌన్‌ తర్వాత షూటింగ్‌ లపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇండోర్‌ లో కాకుండా ఔట్‌ డోర్‌ లో షూటింగ్‌ నిర్వహించాలంటే తప్పనిసరిగా స్థానిక పోలీసుల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కాని రాజ్‌ తరుణ్‌ అండ్‌ టీం బ్యాంకు కాలనీలో షూటింగ్‌ కు ఎలాంటి అనుమతులు తీసుకోలేదట. ఆ కారణంగానే పోలీసులు అక్కడకు చేరుకుని ప్రొడక్షన్‌ టీం పై కేసు నమోదు చేసినట్లుగా సమాచారం అందుతోంది.

కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో చిత్రీకరణ చేసినందుకు గాను కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు అవ్వడంతో షూటింగ్‌ ను నిలిపేస్తున్నట్లుగా యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. వనమాలి క్రియేషన్స్‌ బ్యానర్‌ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ తాత్కాలికంగా నిలిపేశారు. అతి త్వరలోనే అన్ని అనుమతులతో జాగ్రత్తలు తీసుకుని మొదలు పెట్టబోతున్నట్లుగా పేర్కొన్నారు. రాజ్‌ తరుణ్‌ ఒరేయ్‌ బుజ్జిగా సినిమా డైరెక్ట్‌ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యే అవకాశం ఉంది.