Begin typing your search above and press return to search.

ఆమె డబ్బులతో నిర్మాత పరారీ!!

By:  Tupaki Desk   |   12 March 2017 10:44 AM GMT
ఆమె డబ్బులతో నిర్మాత పరారీ!!
X
టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న లేటెస్ట్ రూమర్ ఇది. ఆమె తెలుగు సినిమా పరిశ్రమలో ఓ ప్రముఖ కుటుంబానికిి చెందిన వ్యక్తి. ఆమెకు ఓ నిర్మాతతో వ్యాపార భాగస్వామ్యం ఉంది. ఇద్దరు కలిసి వరుసగా సినిమాలు చేశారు. అంతే కాదు.. ఒకే హీరోతో వరుసగా సినిమాలు చేయడంతో వ్యాపారంపై గట్ట ప్రభావమే పడింది.

గతేడాది వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన మూవీ భారీ ఫ్లాప్ అయిన తర్వాత.. ఈ ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. ఇవి ముదిరాయనే టాక్ కూడా ఉండగా.. ఆ నిర్మాతకు సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్.. ఇన్ఫ్రా.. ఎడ్యుకేషన్ వంటి ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇతను.. ఈమెకు చెందిన డబ్బులతో పరారయ్యాడట. ప్రస్తుతం అతను ఆమె కుటుంబానికి కూడ అందుబాటులోకి.. కనీసం కాంటాక్ట్ లోకి కూడా రావడం లేదని అంటున్నారు.

ఆమె కుటుంబం ఇప్పటికే వరుసగా ఎదురుదెబ్బలు తినడంతో ప్రస్తుతం భారీ నష్టాలతో కొంత కష్టాలను ఎదుర్కుంటోంది. అందుకే ఈమె కుటుంబం ఈ నిర్మాత విషయాన్న సీరియస్ గా తీసుకున్నారట. ఇప్పటికే ఫ్యామిలీలో కూడా ఎక్కువగానే చర్చలు జరుగుతున్నాయట. ప్రస్తుతం అతన్ని కనిపెట్టి.. ఈ విషయాన్ని ప్రైవేటుగా సెటిల్ చేసుకోవాలని ప్రయత్నిస్తోందట ఆమె ఫ్యామిలీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/