Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ ఫ్యాన్స్ దెబ్బకు దిగి వచ్చిన దర్శక నిర్మాతలు
By: Tupaki Desk | 6 Aug 2019 1:30 AM GMTతమిళ హీరో జయం రవి త్వరలో 'కోమలి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'కోమలి' చిత్రం ట్రైలర్ ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. 16 ఏళ్ల తర్వాత కోమా నుండి బయటకు వచ్చిన హీరోకు అంతా కొత్తగా వింతగా అనిపిస్తూ ఉంటుంది. చాలా ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. జయం రవి మరియు కమెడియన్ యోగి బాబులు కలిసి చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయం.
రెండు రోజుల్లోనే ఏకంగా 4.3 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకున్న ఈ ట్రైలర్ పై సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ట్రైలర్ చివర్లో రజినీకాంత్ కు సంబంధించిన ఒక వీడియో ప్రసారం అయ్యింది. ఆ వీడియోలో రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తానంటూ చెప్పడం జరిగింది. దాంతో హీరో 16 ఏళ్ల క్రితం కూడా రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తాను అన్నాడు.. ఇంకా అదే మాట మీద ఉన్నాడు అన్నట్లుగా అర్థం వచ్చేలా అక్కడ సీన్ ఉంది. దాంతో రజినీకాంత్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ విషయమై కమల్ కూడా సీరియస్ అయ్యాడు. రజినీకాంత్ గురించి అలాంటి సీన్ 'కోమలి' ట్రైలర్ లో ఉండటంను ఆయన తప్పు పట్టాడు.
రజినీకాంత్ ను అవమాన పర్చేలా ఆ షాట్ ఉంది అంటూ తలైవర్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. రజినీకాంత్ ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తు సోషల్ మీడియాలో 'కోమలి' చిత్రంకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో చిత్ర దర్శకుడు మరియు నిర్మాత ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది. ఆ వీడియోలో రజినీకాంత్ ను అవమానించే ఉద్దేశ్యం తమకు అసలు లేదని తాము సరదాగానే అలా పెట్టామని దర్శకుడు అన్నాడు. నేను రజినీకాంత్ కు చాలా పెద్ద అభిమానిని అంటూ చెప్పుకునే ప్రయత్నం చేశాడు. అభిమానుల మనోభావాలు దెబ్బ తినేలా చేసినందుకు గాను క్షమాపణలు చెబుతూ సినిమాలో ఆ సీన్ తీసేస్తామని హామీ ఇచ్చారు. రజినీకాంత్ ఫ్యాన్స్ దెబ్బకు చిత్ర దర్శక నిర్మాత దిగి వచ్చి ఆ షాట్స్ ను తీసేసేందుకు ఓకే చెప్పారు.
వీడియో కోసం క్లిక్ చేయండి