Begin typing your search above and press return to search.
ఇన్ని బాధలున్నా ఆమెను మోయడం ఎందుకు?
By: Tupaki Desk | 2 Feb 2020 4:42 AM GMTసౌత్ స్టార్ హీరోయిన్ అని.. లేడీ సూపర్ స్టార్ అంటూ పిలవబడుతున్న నయనతారతో సినిమాలు చేసిన ఏ ఒక్క నిర్మాత కూడా ఆమె పట్ల పూర్తి స్థాయి సంతృప్తితో ఉండడు అంటూ తమిళ సినీ వర్గాల్లో టాక్ ఉంది. ఎందుకంటే ఆమె సినిమా షూటింగ్ సమయంలో పెట్టించే ఖర్చులు మరియు సినిమా పూర్తి అయిన తర్వాత ప్రమోషన్స్ కు రాకుండా చూపించే చుక్కలు వీటన్నింటి వల్ల ఒకసారి ఆమెతో సినిమాను నిర్మించిన నిర్మాతలు మరోసారి ఆమెతో సినిమా అంటేనే భయపడే పరిస్థితి ఉంది.
తాజాగా ఒక తమిళ నిర్మాత ఏకంగా మీడియా ముందుకు వచ్చి నయన్ వల్ల తాను పడ్డ ఇబ్బందులను చెప్పడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్నది నయనతార. అయినా కూడా ఆమె షూటింగ్ సమయంలో తన పర్సనల్ స్టాప్ ఖర్చుల నిమిత్తం 70 వేల నుండి 85 వేల వరకు వసూళ్లు చేస్తుందట. ఔట్ డోర్ షూటింగ్ కు వెళ్లిన సమయంలో ఆమె పర్సనల్ స్టాప్ ఖర్చు మరింత ఎక్కువ అవుతుందట. కేవలం ఆమె మేకప్ ఆర్టిస్టుకు రోజుకు 8 వేల రూపాయలు నిర్మాత చెల్లించాల్సి ఉంటుందట.
సాదారణంగా పర్సనల్ స్టాప్ కు ఆ స్టార్ చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాని నయనతారను నిర్మాతలు కోరుకుంటున్నారు కనుక ముందే తన పర్సనల్ స్టాప్ ఖర్చులను భరించాల్సిందిగా కండీషన్ పెడుతుందట. సినిమా పూర్తి అయ్యేప్పటికి ఆమె పర్సనల్ స్టాప్ ఖర్చులు 40 నుండి 50 లక్షలు అవుతుందని నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. ఇంత ఖర్చు పెడితే ఆమె ప్రమోషన్స్ కు వస్తుందా అంటే అదీ లేదు. అదనంగా డబ్బులు ఇస్తానన్నా కూడా ప్రమోషన్స్ కు మాత్రం వచ్చేది లేదంటే లేదు అంటుంది.
నయన్ వల్ల ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఎందుకు ఆమెను భరించాలని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ప్రమోషన్స్ కు రాకపోవడం నిర్మాతకు చాలా పెద్ద నష్టం. అది కాకుండా భారీ పారితోషికం.. పర్సనల్ స్టాప్ ఖర్చులు ఇన్ని వసూళ్లు చేస్తూ నిర్మాతలను చిత్తడి చేస్తున్న ఆమెను భరించడం ఎందుకు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. నయన్ ఇదే పరిస్థితిని కొనసాగిస్తే కోలీవుడ్ లో అతి త్వరలోనే ఆమె శకం ముగిసి పోవడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.