Begin typing your search above and press return to search.
క్రేజీ ఆఫర్లున్నా మెగా ప్రొడ్యూసర్ నో..
By: Tupaki Desk | 10 Jan 2022 9:30 AM GMTదేశ వ్యాప్తంగా కోవిడ్ కారణంగా పరిస్థితులు మారిపోతున్నాయి. దీంతో భారీ చిత్రాల రిలీజ్ లతో పాటు పాన్ ఇండియా మూవీ రిలీజ్‌లు వాయిదా పడిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన `ఆర్ ఆర్ ఆర్` పరిస్థితుల ప్రభావం వల్ల రిలీజ్ వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి బిగ్ స్టార్స్ కలిసి నటించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 7న విడుదల చేయాలని భారీ స్థాయిలో ప్లాన్ చేశారు.. పలు ఓటీటీ సంస్థలు కూడా భారీ ఆఫర్ లు ఇచ్చాయి.
అయినా ఈ మూవీ థియేటర్లలో మాత్రం విడుదల చేయాలనుకుంటున్నామని మేకర్స్ నిక్కచ్చిగా చెప్పేసి రిలీజ్ ని వాయిదా వేశారు. ఇదే తరహాలో ప్రభాస్ నటించిన `రాధేశ్యామ్` రిలీజ్ కూడా వాయిదా పడింది. ఇదే తరహాలో కొన్ని చిన్న చిత్రాలు కూడా ఓటీటీ ఆఫర్ వున్నా థియేర్లలో రిలీజ్ చేయాలని ప్రస్తుతం రిలీజ్ లని వాయిదా వేసుకున్నారు. అయితే మెగా ప్రొడ్యూసర్, మాస్టర్ మైండ్ అల్లు అరవింద్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తున్నారు.
కోవిడ్ తో పరిస్థితులు మారుతున్నా... థియేటర్లలో క్రేజీ సినిమాలు విడదుల చేసే పరిస్థితి కనిపించకపోయినా సరే తాను మాత్రం తన సినిమాలని ఓటీటీకి కాకుండా థియేటర్ లలోనే విడుదల చేస్తానంటూ ఖరాకండీగా నిర్ణయించుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అల్లు అరవింద్ ప్రస్తుతం `ఆహా` ఓటీటీ సంస్థ ని నడిపిస్తున్న విషయం తెలిసిందే. తన సినిమాలకు థియేటర్లు లభించకపోతే వాటిని తన ఓటీటీలో రిలీజ్ చేసుకునే వసులు బాటు వుంది.
అయితే తనకు అలాంటి ఛాన్స్ వున్నా తను నిర్మించిన సినిమాలకు పాపులర్ ఓటీటీలు భారీ ఆఫర్ లు ఇచ్చినా అల్లు అరవింద్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ ఆఫర్లని అంగీకరించేది లేదని, తన సినిమాలని థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేస్తానని స్పష్టం చేస్తుండటం విశేషం. ప్రస్తుతం ఆయన `పక్కా కమర్షియల్, 18 పేజెస్, జెర్సీ హిందీ రీమేక్, అల్లు శిరీష్ `ప్రేమ కాదంట`, వరుణ్ తేజ్ `గని` తదితర చిత్రాలని నిర్మిస్తున్నారు.
ఈ మూవీలన్నీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా వున్నా వాటికి భారీ ఓటీటీ సంస్థలు ఆఫర్లు ఇస్తున్నా... రిలీజ్ లేట్ అవుతున్న కొద్దీ ఫైనాన్స్ పై వడ్డీ పురుగుతున్నా ఈ సినిమాలని థియేటర్ లో రిలీజ్ చేయడానికే ఆయన డిసైడ్ అయ్యారు. దీంతో ఈ డేర్ ఏంటీ అని ఇండస్ట్రీ వర్గాలు అవాక్కవుతున్నాయి. ముందు నుంచి డేరింగ్ స్టెప్ లతో మాస్టర్ మైండ్ గా పేరు తెచ్చుకుంటున్న అల్లు అరవింద్ పుట్టిన రోజు నేడు.. ఈ సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తున్నారు ఇండస్ట్రీ జనం.