Begin typing your search above and press return to search.
అందుకే బాసూ మనం యాక్టింగ్ వైపు వెళ్లలేదు: అల్లు బాబీ
By: Tupaki Desk | 31 March 2022 3:30 AM GMTసాధారణంగా ఎక్కడైనా ఒక సినిమా ఫంక్షన్ జరుగుతుంటేనే అందుకు సంబంధించిన ఫొటోల్లో పడాలనే ఆరాటాన్ని చాలా మంది ప్రదర్శిస్తూ ఉంటారు. అలాంటిది వెండితెరపై కనిపించే అవకాశం వస్తే వదులుకుంటారా? స్టార్ డమ్ లు .. పారితోషికాలు పక్కన పెడితే, తెరపై అసలు మనం ఎలా కనిపిస్తామనేది చూసుకోవాలని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. ఇక ఏదైనా సినిమాలో చిన్నపాత్ర వేస్తే .. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఎవరైనా సరే గుర్తుపట్టి 'సార్ .. ఓ సెల్ఫీ' అంటే అప్పుడు కలిగే ఆనందానికి హద్దులు ఉండవు.
ఎంత డబ్బు ఉన్నప్పటికీ .. నలుగురిలోకి వెళ్లినప్పుడు ఒకసారి చూసేసి ఊర్కుంటారు. అదే సినిమా స్టార్ అయితే దగ్గరికి పరిగెత్తుకు వస్తారు. క్రేజ్ ఎక్కువగా ఉంటే ఒకరిని ఒకరు తోసుకుంటూ మీదపడిపోతారు. అలాంటి ఒక క్రేజ్ కోసమే ఇండస్ట్రీకి చాలామంది వస్తుంటారు. అవకాశాల కోసం అదే పనిగా తిరుగుతుంటారు. చిన్న వేషమైనా ఫరవాలేదు సార్ అంటారు .. అలాంటి ఒక ఛాన్స్ కోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తారు. కానీ అన్ని రకాల అవకాశాలు ఉండి కూడా .. తెరపై కనిపించడానికి ఎలాంటి ప్రయత్నం చేయనివారిని చూస్తే ఎవరికైనా ఆశ్చర్యమే కలుగుతుంది.
అల్లు బాబీని చూసినప్పుడు కూడా అలాంటి ఆశ్చర్యమే కలుగుతుంది. నిర్మాతగా అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన వారసుడిగా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. ఇక అల్లు శిరీష్ కూడా నిదానమే ప్రధానమన్నట్టుగా ఒక్కో సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. కానీ అల్లు బాబీ మాత్రం నటన వైపు ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. సరదాగా కూడా అలాంటి ఒక ఆలోచన చేయలేదు. నిర్మాణ పరమైన పనులను మాత్రమే చూసుకుంటూ వస్తున్న ఆయనకి, తాజా ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురైంది.
" కొంతకాలం క్రితం వరకూ కూడా నటనవైపుకు రమ్మంటూ నాకు అవకాశాలు వచ్చాయి. కానీ నేను వాటిని సున్నితంగానే తిరస్కరించాను. కేరక్టర్ ఆర్టిస్టుగా చేసినా మంచి పారితోషికాలు ఉన్నాయి. అయినా నేను ఆ వైపుకు వెళ్లలేదు. నటన వైపుకు వెళితే ఒక రకమైన క్రేజ్ ఉంటుంది. అందువలన వాళ్లు బయట స్వేచ్ఛగా తిరగలేరు.
ఈ విశాలమైన ప్రపంచంలో నేను ఎక్కడికైనా .. ఎప్పుడైనా వెళ్లాలి .. స్వేచ్ఛగా తిరగాలి. ఆ స్వేచ్ఛను కోల్పోవడం నాకు ఇష్టం లేదు. అందుకే అవకాశం ఉన్నప్పటికీ నేను ఎప్పుడూ నటన వైపుకు వెళ్లలేదు" అని చెప్పుకొచ్చాడు. ఆయన నిర్మించిన 'గని' సినిమా, ఏప్రిల్ 8వ తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే.