Begin typing your search above and press return to search.
పవన్ తీరు వేరు .. ఆయన దారి వేరు: నిర్మాత ఎ.ఎమ్. రత్నం
By: Tupaki Desk | 2 Sep 2021 10:31 AM GMTఈ రోజున పవన్ కల్యాణ్ పుట్టినరోజు .. ఆయన అభిమానులంతా పండగలన్నీ ఒక్కసారి కలిసివచ్చినట్టుగా సంబరాలు జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన తాజా చిత్రాల తాలూకు విశేషాల సందడి కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ గురించి ఆయన సన్నిహితులు తమ మనోభావాలను మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆయనతో 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్న నిర్మాత ఎ.ఎమ్. రత్నం కూడా తనకి తెలిసిన పవన్ గురించి మాట్లాడారు.
"ముందుగా పవన్ కల్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యూత్ ను ఎప్పటికప్పుడు ఉత్సాహ పరుస్తూ .. ఉత్తేజపరుస్తూ వెళుతున్న కారణంగానే, ఆయనకి 'పవర్ స్టార్' అనే బిరుదు వచ్చింది. యూత్ అంతా కూడా ఆయన సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. తనదైన స్టైల్ తో పవన్ ఈ స్థాయికి ఎదిగారు. నేను పవన్ తో నిర్మించిన 'ఖుషి' సినిమా నుంచి ఆయనను చాలా దగ్గరగా గమనిస్తూ వస్తున్నాను. పవన్ కల్యాణ్ గారు చాలా సెన్సిటివ్ .. ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా వెంటనే ఆయన రియాక్ట్ అవుతుంటారు.
ఒక వైపున సినిమాలు చేస్తున్నప్పటికీ, ఆయన దృష్టి అంతా కూడా ప్రజాసేవపైనే ఉండటం నేను గమనించాను. ఎక్కడ మంచి పుస్తకాలు కనిపించినా వెంటనే కొనేస్తూ ఉంటారు .. అదే పనిగా ఆ పుస్తకాలను చదువుతూ ఉంటారు. ఆయనకి ఎంతో నాలెడ్జ్ ఉంది .. ఈ సమాజానికి ఏదో చేయాలనే ఒక తపనను నేను ఆయనలో చూశాను. పార్టీని నడిపించడానికి డబ్బుకావాలి .. అందుకోసమే ఆయన సినిమాలు చేస్తున్నారు. ఒక వైపున రాజకీయాలు .. మరో వైపున సినిమాలు .. నిజం చెప్పాలంటే ఇది చాలా కష్టతరమైన ద్విపాత్రాభినయం.
నేను నిర్మించిన 'ఖుషి' సినిమాతో పవన్ క్రేజ్ మరింత పెరగడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిన విషయం. ఆ తరువాత ఆయనతో నేను 'బంగారం' తీశాను. నిజానికి అది యావరేజ్ అనిపించుకోవలసిన సినిమా.. కానీ పవన్ ఇమేజ్ కారణంగా సక్సెస్ అయింది. ఇప్పుడు నేను పవన్ కి తగిన సినిమాగా 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్నాను. ఇంతవరకూ ఆయన చేయని పాత్ర ఇది. 17వ శతాబ్దంలో సాగే కథ ఇది. తప్పకుండా ఇది ఆయన కెరియర్లోనే గొప్ప సినిమా అవుతుంది. ఒక్క తెలుగులోనే కాదు .. దేశంలోని అన్ని భాషల్లో విడుదల చేయతగిన కథ ఇది. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాము" అని చెప్పుకొచ్చారు.