Begin typing your search above and press return to search.
ఏజెంట్ దెబ్బపై కుండబద్దలు కొట్టిన నిర్మాత
By: Tupaki Desk | 1 May 2023 5:51 PM GMTఅఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ యాక్షన్ మూవీగా ఏజెంట్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమాని సురేందర్ రెడ్డి ఆవిష్కరించారు. మొదట అనిల్ సుంకరతో పాటు సురేందర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నప్పటికి మళ్ళీ ఎందుకో సురేందర్ రెడ్డి వెనుకడుగు వేసి కేవలం డైరెక్షన్ మాత్రమే చూసుకున్నారు. ఇక ఈ సినిమా అఖిల్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రంగా మారింది.
మొదటి రోజు మొదటి ఆటతోనే సినిమా డిజాస్టర్ గా ప్రేక్షకులలోకి వెళ్ళిపోయింది. దీంతో రెండో రోజుకె కలెక్షన్స్ కంప్లీట్ గా డ్రాప్ అయిపోయాయి. సినిమాలో అఖిల్ యాక్షన్ పెర్ఫార్మెన్స్ తప్ప ఏ ఒక్క యాంగిల్ లో కూడా మెప్పించలేదనే అభిప్రాయం ఆడియన్స్ నుంచి వస్తోంది. ఈ సినిమా బ్రేక్ ఎవెన్ కలెక్షన్స్ లో 30 శాతం కూడా వచ్చే అవకాశం లేదని తేలిపోయింది.
ఇక తాజాగా నిర్మాత అనిల్ సుంకర ఏజెంట్ మూవీ ఫెయిల్యూర్ పై లో ఓపెన్ లెటర్ తో కుండబద్దలు కొట్టేశారు. ఏజెంట్ మూవీ ఫెయిల్యూర్ కి కంప్లీట్ గా బాద్యత తీసుకుంటున్నామని తెలిపారు. దీనిపై ఎలాంటి సాకులు చెప్పాలని అనుకోవడం లేదు. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండానే మేము షూటింగ్ స్టార్ట్ చేయడం ప్రధానమైన లోపం. అలాగే మూవీ తెరకెక్కించే సమయంలో కరోనా విపత్తుతో పాటు చాలా సమస్యలు చుట్టుముట్టాయి. వీటన్నింటి కారణంగా అనుకున్న విధంగా ప్రాజెక్ట్ ని సిద్ధం చేసి ఇవ్వలేకపోయాం.
మా ఖరీదైన పొరపాటుకి భారీగానే మూల్యం చెల్లించుకున్నాం. భవిష్యత్తులో ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నాం. మాపై నమ్మకం ఉంచినందుకు ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. ఇకపై మరింత మంచి కథలతో సినిమాలు అందించే ప్రయత్నం చేస్తాం అని అనిల్ సుంకర ట్విట్టర్ లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
అంతే కాకుండా భవిష్యత్తు ప్రాజెక్టులతో నష్టాలను పూరించే ప్రయత్నం చేస్తామని కూడా అన్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఏజెంట్ ఫెయిల్యూర్ కి అసలు కారణం స్క్రిప్ట్ లేకుండా మూవీ స్టార్ట్ చేయడమే అని నిర్మాత మాటల బట్టి పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. మొత్తానికి ఆ ఒక్క పొరపాటు కారణంగా ఇప్పుడు ఏకంగా 50 కోట్లకి పైనే నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పాలి. ఈ సినిమాను దాదాపు 65 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించినట్లు టాక్.