Begin typing your search above and press return to search.

అఖిల్ `ఏజెంట్` పై ప్రొడ్యూస‌ర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

By:  Tupaki Desk   |   25 July 2022 8:47 AM GMT
అఖిల్ `ఏజెంట్` పై ప్రొడ్యూస‌ర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X
అక్కినేని అఖిల్ న‌టిస్తున్న హై వోల్టేజ్ యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ `ఏజెంట్‌`. స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై స్టార్ ప్రొడ్యూస‌ర్ అనిల్ సుంక‌ర నిర్మిస్తున్నారు.

సాక్షి వైద్య హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతున్న ఈ మూవీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోంది. నిర్మిస్తున్నారు. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారు. హీరో అఖిల్ 5వ ప్రాజెక‌ట్్ గా రూపొందుతున్న ఈ మూవీ అత‌ని కెరీర్ కి అత్యంత కీల‌కంగా మారింది.

కార‌ణంగా త‌న గత సినిమాల‌కు పూర్తి భిన్నంగా త‌న మార్కుట్ స్థాయికి మించి ఈ మూవీని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డికి కూడా ఆ ప్రాజెక్ట్ అత్యంత క్రూషియ‌ల్‌. మెగాస్టార్ తో చేసిన `సైరా నర‌సింహారెడ్డి` ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. దీంతో త‌న ఆశ‌ల‌న్నీ `ఏజెంట్‌`పైనే పెట్టుకున్నాడు.

అయితే తాజాగా రిలీజ్ చేసిన ఈ మూవీ టీజ‌ర్ సినిమాపై అంత‌గా బ‌జ్ ని క్రియేట్ చేయ‌లేక‌పోయింద‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే తాజాగా ఈ సినిమా ప్రొడ్యూస‌ర్ అనిల్ సుంక‌ర `ఏజెంట్‌`పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ప్ర‌త్యేకంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. ప్ర‌తి న‌టుడు, హీరో త‌నని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తుంటారని `ఏజెంట్‌` అఖిల్ కు అలాంటి సినిమా అని పేర్కొన్నారు.

అంతే కాకుండా ఈ మూవీపై ల‌న‌కు ల‌భించిన ప్ర‌శంస‌ల్ని గుర్తు చేసుకున్నారు. సినిమా అత్యంత భారీ బ‌డ్జెట్ తో చాలా రిచ్ గా వుంద‌ని అంతా అంటున్నార‌ని, అంతే కాకుండా సినిమాని డిజైన్ చేసిన తీరు, హీరో అఖిల్ స్టైలిష్ మేకోవ‌ర్‌, గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా క‌నిపించిన తీరుకు అంతా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నార‌ని తెలిపారు. ఇందు కోసం అఖిల్ చాలా హార్డ్ వ‌ర్క్ చేశార‌ని, ఈ సినిమాతో అత‌ని రేంజ్ 10 నుంచి 100 శాతం పెరుగుతుంద‌ని తెలిపారు.

గ‌తంలో చాలా మంది స్టార్ హీరోల‌తో వ‌ర్క్ చేసిన అనిల్ సుంక‌ర `ఏజెంట్‌` విష‌యంలో చాలా కాన్ఫిడెంట్ గా కనిపించ‌డం ఇదే మొద‌టిసారి అని ఇన్ సైడ్ టాక్‌. అయితే ఈ మూవీకి పెడుతున్న బ‌డ్జెట్ ని దృష్టిలో పెట్టుకుని ట్రేడ్ వ‌ర్గాలు కామెంట్ లు చేస్తున్నాయి. హీరో రేంజ్ కి మించిన బ‌డ్జెట్ తో ఈ మూవీని చేస్తున్నార‌ని, అనుకున్న రేంజ్ హిట్ గా `ఏజెంట్` నిలిస్తేనే ప్రొడ్యూస‌ర్ కు లాభాలు వ‌స్తాయ‌ని, తేదంటే భారీ స్థాయిలో న‌ష్ట‌పోవ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.