Begin typing your search above and press return to search.

స్టార్ హీరో కొడుకుతో టైటానిక్??

By:  Tupaki Desk   |   28 Dec 2017 11:30 PM GMT
స్టార్ హీరో కొడుకుతో టైటానిక్??
X
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ గత కొంత కాలంగా తెలుగులో అంతగా రాణించడం లేదు గాని కోలీవుడ్ లో మాత్రం మంచి హిట్స్ అందుకుంటున్నాడు. రీసెంట్ గా కోలీవుడ్ లో రిలీజ్ అయిన మాయావన్ అనే సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఆ సినిమా తెలుగులో ప్రాజెక్ట్ జెడ్ అనే పేరుతో ఈ శుక్రవారం రిలీజ్ కాబోతోంది. దర్శకుడు సీవీ కుమార్ తనే సినిమాను నిర్మించాడు.ఈ సినిమా తెలుగులో హిట్ అవుతుంది అనే నమ్మకంతో ఉన్నారు సదరు టీమ్.

ఇక అసలు విషయానికి వస్తే ఆ చిత్ర దర్శకుడు మరొక సినిమాను నిర్మించడానికి రెడీ అయ్యాడు. పూర్తిగా నూతన నటీనటులతో తెరకెక్కబోయే ఆ సినిమాకు రీసెంట్ డిఫెరెంట్ టైటిల్ ని కూడా సెట్ చేశాడు. యూత్ ఫుల్ డ్రామాగా తెరకెక్కబోయే ఆ సినిమాకు కథను బట్టి టైటానికి అనే టైటిల్ ను సెట్ చేశారట. ఇక సివి కుమార్ దగ్గర వర్క్ చేసిన కొత్త దర్శకుడు జానకి రామ్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. నెక్స్ట్ ఇయర్ జనవరిలో సినిమాను మొదలు పెట్టి సమ్మర్ లో రిలీజ్ చేయాలనేది ప్లాన్. ఇంతకీ ఈ సినిమాలో కొత్త హీరో అంటే ఎవరో తెలుసా?

ఒక ప్రముఖ స్టార్ హీరో కొడుకును ఈ టైటానిక్ తో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎవ్వరికీ ఎక్స్ పెక్టేషన్లను పెంచేయకుండా.. సినిమా మొత్తం అయిపోయాక.. వివరాలు ప్రకటిస్తారట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? అతని కొడుకు ఎవరు? ప్రస్తుతానికి అదంతా సస్పెన్స్ అంటున్నారు ఈ టీమ్.