Begin typing your search above and press return to search.
'శాకుంతలం' రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!
By: Tupaki Desk | 27 Oct 2022 11:44 AM GMTమహాకవి కాళిదాసు రచించిన అద్భుత శృంగారభరిత ప్రేమ కావ్యం 'అభిజ్ఞాన శాకుంతలం'. మహాభారతంలోని ఆదిపర్వంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా కాళిదాసు శకుంతల.. దుష్యంతుల ప్రేమాయణాన్ని తనదైన శైలిలో సంస్కృతంలో రాశారు. ఆ తర్వాతి కాలంలో ఈ కథ అన్ని భాషల్లో తర్జుమా అయి విశేష ఆదరణ పొందింది.
ఆది ప్రేమ కావ్యం గా పిలువబడుతున్న ఈ కథను ఆధారంగా చేసుకొని దర్శకుడు గుణ శేఖర్ 'శాకుంతలం' మూవీని తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో డీఆర్పీ.. గుణ టీమ్ వర్క్స్ పతకాలపై నీలిమా గుణ 'శాకుంతలం' మూవీని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా సినిమాటోగ్రఫర్ గా శేఖర్ వి.జోసఫ్ వ్యవహరిస్తున్నారు.
స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న్ తొలి పౌరణిక సినిమా కూడా ఇదే కావడం విశేషం. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఈ సినిమాలో దుష్యంతుడిగా మలయాళ స్టార్ హీరో దేవ్ మోహన్ నటిస్తున్నాడు. 2021 మార్చి 21న ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా ఫస్ట్ లుక్ పోస్టర్ 2022 ఫిబ్రవరి 21 న విడుదలైంది.
ఈ మూవీలో సమంత రాకుమారిగా కన్పించనుంది. మహారాజుగా దేవ్ మోహన్.. దుర్వాస మునిగా మంచు మోహన్ బాబు.. అల్లు అర్జున్ తనయ అల్లు అర్ష ప్రిన్స్ భారతగా నటిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 4న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తొలుత ప్రకటించింది. అయితే ఈ సినిమాను త్రీడీలో తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో విడుదల తేదీని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే దీనిపై ఎలాంటి అవగాహన లేని ఓ అభిమాని నిర్మాత నీలిమా గుణను ట్యాగ్ చేస్తూ "శాకుంత మూవీ నవంబర్ 4న వస్తుందని ప్రకటించారు.. ఇంత వరకు ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు.. కనీసం టీజర్ కూడా ఇవ్వలేదు.. మేము సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాం.. మరోవైపు సమంత 'యశోద' బజ్ నెలకొంది.." అంటూ ట్వీట్ చేశాడు.
దీనిపై నీలిమ గుణ స్పందిస్తూ 'శాకుంతలం' మూవీ నవంబర్ 4న రావడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా కథను విభిన్నమైన అనుభూతిలో పంచాలనే ఉద్దేశ్యంతో త్రీడీలో కూడా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ పనులు పూర్తయ్యాక సినిమాను ఒకేసారి థియేటర్లలో విడుదల చేస్తామన్నారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని నీలిమ గుణ సదరు అభిమానికి రీ ట్వీట్ చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.