Begin typing your search above and press return to search.
స్టార్ ప్రొడ్యూసర్ ఫైనల్ గా నోరు విప్పేస్తారా?
By: Tupaki Desk | 2 Oct 2022 5:17 AM GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని నెలలుగా సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. షూటింగ్ లు నిలిపివేయడం.. టికెట్ ధరలు, కార్మికుల కనీసవేతనాలు వంటి పలు సమస్యలు, హీరోలు, హీరోయిన్ లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల పారితోషికాలు, వారి వ్యక్తిగత సిబ్బంది ఖర్చులు వంటి వాటిపై ఇటీవల తీవ్ర చర్చ జరిగిన విషయం తెలిసిందే. అంతే కాకుండా సినిమా బడ్జెట్ లపై కూడా నియంత్రణ వుండాలంటూ చాలా మంది నిర్మాతలు ఈ విషయంపై చర్చించారు.
అయితే ఇండస్ట్రీలో ఇంత జరుగుతున్నాస్టార్ ప్రొడ్యూసర్, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్ బాబు మాత్రం స్పందించలేదు. అంతే కాకుండా తాను ఇండస్ట్రీలో వున్నానన్న విషయాన్నే మర్చిపోయేలా సైలెంట్ అయిపోయారు. ప్రతీ సందర్భంలోనూ తన గళాన్ని ప్రధానంగా వినిపించే డి. సురేష్ బాబు ఉన్నట్టుండి ఎందుకు సైలెంట్ అయ్యారు?.. తను ఎందుకు ఇండస్ట్రీ సమస్యలపై చొరవ తీసుకోవడం లేదు? అన్నది ప్రతీ ఒక్కరి మైండ్ ని తొలిచేస్తోంది.
అయితే ఇన్నాళ్లూ ఈ విషయాలపై మౌనంగా వున్న సురేష్ బాబు ఫైనల్ గా నోరు విప్పే టైమ్ వచ్చేసింది. వివరాల్లోకి వెళితే.. డి. సురేష్ బాబు తనయుడు, రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. `అహింస` పేరుదో తేజ దర్శకత్వంలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై జెమిని కిరణ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ లో రిలీజ్ కాబోతోంది.
ఇటీవలే ప్రమోషనల్ యాక్టివిటీస్ ని ప్రారంభించిన చిత్ర బృందం ఫస్ట్ సింగిల్, క్యారెక్టర్ల పరిచయం వంటి వీడియోలని ప్రేక్షకులతో పంచుకుంది. త్వరలో టీజర్ ని విడుదల చేయబోతున్నారట. ఈ సందర్భంగా పెద్ద ఈవెంట్ ని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఈ ఈవెంట్ లో సురేష్ బాబు కూడా పాల్గొనబోతున్నారని తెలిసింది. ఈ సందర్భంగా అభిరామ్ ఎంట్రీ గురించి మాట్లాడటమే కాకుంవడా ఇండస్ట్రీలో గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలపై కూడా సురేష్ బాబు స్పందించే అవకాశం వుందని తెలుస్తోంది.
సురేష్ బాబు స్పందించకపోయినా మీడియా ఖచ్చితంగా సురేష్ బాబు ఎందుకు ఇండస్ట్రీ సమస్యల విషయంలో యాక్టీవ్ పార్ట్ తీసుకోలేదని, ఎందుకు సైలెంట్ గా వున్నారని అడగడం.. ఆయన అందుకు గల కారణాలని చెప్పడానికి ఫైనల్ గా నోరు విప్పడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఆయన ఎలా స్పందిస్తారు. ఇండస్ట్రీ రాజకీయాపై ఏమంటారు? అన్నది తెలియాలంటే `అహింస` టీజర్ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.