Begin typing your search above and press return to search.
వకీల్ సాబ్ ఓటిటి రిలీజ్ అప్పుడే: నిర్మాత దిల్ రాజు క్లారిటీ
By: Tupaki Desk | 13 April 2021 11:42 AM GMTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం నమోదు చేసింది. రీమేక్ సినిమా అయినప్పటికీ అద్భుతమైన వసూళ్లు రాబడుతుండటం విశేషం. అయితే పవర్ స్టార్ మూడేళ్లు గడిచాక తెరపై కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వకీల్ సాబ్ విడుదలైన మొదటిరోజు నుండే రికార్డు కలెక్షన్స్ నమోదు చేస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ సినిమా పోటీకి రాకపోయే సరికి వకీల్ సాబ్ హవా ఇంకా థియేటర్లలో కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం సినిమా విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. ఇదిలా ఉండగా.. వకీల్ విడుదలైన కొద్దీరోజులకే డిజిటల్ రిలీజ్ కాబోతుందనే పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ విషయం తెలుసుకున్న వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు తాజాగా సోషల్ మీడియా వేదికగా వీడియో రూపంలో సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. "వకీల్ సాబ్ సినిమా పై వస్తున్న పుకార్లను నేను కూడా విన్నాను. వకీల్ సాబ్ ఓటిటిలో వస్తుందనేది అవాస్తవం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ స్టార్ సినిమా అయినా థియేట్రికల్ రిలీజైన 50రోజుల తర్వాతే ఓటిటిలోకి వస్తుంది. మా వకీల్ సాబ్ కూడా 50 రోజులయ్యాక ఓటిటి రిలీజ్ చేస్తాం. ఇంతమంచి సినిమా అని భావించిన తెలుగు ప్రేక్షకులు దయచేసి సినిమాను థియేటర్లో చూసేందుకే ట్రై చేయండి. ఎందుకంటే సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఫోన్లో, టీవీలలో రాదు. అలాగే కోవిడ్ టైం కాబట్టి మాస్కులు ధరించండి" అన్నాడు. వేణుశ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు.