Begin typing your search above and press return to search.
దిల్ రాజు ఎపిసోడ్.. మీడియానే కెళికి పెద్దది చేస్తోందట!
By: Tupaki Desk | 17 Dec 2022 6:37 AM GMTదిల్ రాజు.. టాలీవుడ్, కోలీవుడ్ లో ప్రస్తుతం ఈ పేరు మారుమోగిపోతోంది. టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా, నైజామ్, ఉత్తరాంధ్రా కీలక డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. సినిమా షూటింగ్ ల బంద్ సమయంలో మిగతా వర్గం కారణంగా వార్తల్లో నిలిచిన దిల్ రాజు తాజాగా సంక్రాంతి సినిమాల రిలీజ్ ల విషయంలోనూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తూ చర్చనీయాంశంగా నిలిచారు. దిల్ రాజు ఈ సంక్రాంతికి విజయ్ తో నిర్మిస్తున్న 'వారసుడు' మూవీని రిలీజ్ చేస్కతున్న విషయం తెలిసిందే.
ఇదే సంక్రాంతికి తెలుగు స్టార్స్ బాలకృష్ణ నటిస్తున్న 'వీర సింహారెడ్డి', చిరంజీవి చేస్తున్న 'వాల్తేరు వీరయ్య' సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలకు ప్రధాన థియేటర్స్ దక్కకుండా దిల్ రాజు తన 'వారసుడు' సినిమా కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కీలక థియేటర్లని బ్లాక్ చేశాడంటూ విమర్శలు వినిపించడం మొదలైంది. దీనిపై నిర్మాతల మండలి స్పందించడం.. పండగ సీజన్ లలో తెలుగు సినిమాలకే ప్రధాన్యత ఇవ్వాలని ఓ ప్రకటనని విడుదల చేయడంతో అసలు వివాదం మొదలైంది.
ఈ ప్రకటన తమిళ ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్ని సృష్టించింది. తమిళ నిర్మాతలు కొంత మంది తెలుగు నిర్మాతల మండలి తీరుపై ఘాటుగా స్పందించారు. ఆ తరువాత దర్శకుడు లింగు స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. దిల్ రాజుకు సపోర్ట్ గా మాట్లాడుతూ నిర్మాతల మండలిపై బెదిరింపులకు దిగడం తెలిసిందే. ఇదిలా వుంటే ఓ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన దిల్ రాజు థియేటర్ల వివాదం వెనక ఎవరున్నారో.. ఎందుకు ఇలా చేస్తున్నారో తనకు బాగా తెలుసునని, సమయం వచ్చినప్పుడు చెబుతానని దిల్ రాజు వెల్లడించారు.
దీనిపై టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. ఇదిలా వుంటే తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత వివాదంగా మారాయి. విజయ్ కోలీవుడ్ లో నెంబర్ వన్ అని, అజిత్ కి మించిన క్రేజ్ విజయ్ సొంతమని అజిత్ సినిమాకి మించి విజయ్ సినిమాకు థియేటర్లు కేటాయించాలంటూ అన్న మాటలు ఇప్పడు తమిళనాట సరికొత్త వివాదానికి తెర తీశాయి.
తమిళంలో విజయ్ తో నేను నిర్మించిన 'వారీసు'తో పాటు అజిత్ హీరోగా నటించిన సినిమా కూడా తమిళనాడులో రిలీజ్ అవుతోంది. అజిత్ తో పోలిస్తే విజయ్ అక్కడ నెంబర్ వన్ స్టార్. అక్కడ మొత్తం 800 థియేటర్స్ వున్నాయని, విజయ్ సినిమాకు 400 థియేటర్స్ మాత్రమే ఇస్తామంటున్నారని తాను మాత్రం మరో 50 కావాలని అడుగుతున్నాను అన్నారు.
దిల్ రాజు చేసిన వ్యాఖ్యలపై తాజాగా తమిళనాట అజిత్, విజయ్ అభిమానుల్లో వివాదం రాజుకుంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తాజాగా ఈ వివాదంపై పై దిల్ రాజుని మీడియా వ్యక్తులు ప్రశ్నిస్తే.. 'ఈ విషయంపై మళ్లీ కెళకొద్దు' అన్నారట. అంతే కాకుండా నేను ఎవరినీ ఎలివేట్ చేయలేదు.. అలా అని ఎవరినీ డీగ్రేడ్ చేయలేదని, తను అన్న మాటలని మీడియానే కెళికి పెద్దది చేస్తోందనే రీతిలో స్పందించారట దిల్ రాజు. నెట్టింట మీమ్స్ తో చెలరేగిపోతున్న ఫ్యాన్స్ దిల్ రాజు మాటలకు ఏమంటారో.. అని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.