Begin typing your search above and press return to search.
నా పేరుని వాడుతూ రకరకాలుగా రాస్తున్నారు.. ఐనా నాకేం బాధలేదు: దిల్ రాజు
By: Tupaki Desk | 5 Aug 2022 4:18 AM GMTప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలకు సమావేశాల ద్వారా పరిష్కరం చూపాలని నిర్మాతలు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. ఫిలిం ఛాంబర్ నిర్ణయం మేరకు ఆగస్ట్ 1వ తారీఖు నుంచి అన్ని తెలుగు సినిమాల షూటింగ్స్ పూర్తిగా నిలిపివేసారు. ఈ నేపథ్యంలో గురువారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రత్యేకంగా సమావేశమైంది.
సినిమాలు ఎన్ని వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలి? థియేటర్స్ లో వీపీఎఫ్ చార్జీలు ఎంత ఉండాలి? వంటి పలు అంశాలపై ఛాంబర్ సభ్యులు చర్చించారు. షూటింగ్ బంద్ వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటి.. సమస్యల పురస్కారం కోసం ఏవిధంగా ముందుకు వెళ్తున్నారు.. అనే విషయాలని వివరించేందుకు నిర్మాతలు దిల్ రాజు - సి కళ్యాణ్ - ప్రసన్న కుమార్ వంటి పలువురు సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు.
సమావేశం అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ ఓటీటీ - వీపీఎఫ్ ఛార్జీలు - రెవెన్యూ పర్సంటేజీ - సినీ కార్మికుల వేతనాలు - నిర్మాణ వ్యయాలపై నాలుగు కమిటీలు పనిచేస్తున్నాయని తెలిపారు. తనకి ఎలాంటి వ్యక్తిగత అజెండాల్లేవని.. కేవలం సినిమాల కోసం మాత్రమే పనిచేస్తానని ఈ సందర్భంగా అన్నారు. మీడియాలో యూట్యూబ్ ఛానెల్స్ ఎవరికి ఇష్టమొచ్చింది వాళ్ళు వార్తలుగా రాసేస్తున్నారని.. తన పేరుని వాడుతూ రకరకాలుగా రాస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
''నిర్మాతలం అందరం కలిసి షూటింగ్స్ ఆపుకున్నాం. మేము ప్రస్తుతం నాలుగు అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నాం. సినిమాలు ఓటీటీకి ఎన్ని వారాలకు వెళితే ఇండస్ట్రీకి మంచిది అన్న విషయంలో ఓ కమిటీ వేసుకున్నాం. ఆ కమిటీ ఓటీటీకి సంబంధించిన దానిపై పని చేస్తోంది. రెండోది థియేటర్స్ లో వీపీఎఫ్ చార్జీలు - పర్సెంటేజీలు ఎలా ఉండాలన్న దానిపై కమిటీ వేశాం. ఆ కమిటీ ఎగ్జిబిటర్స్తో మాట్లాడుతుంది. ఫెడరేషన్ వేజెస్ - వర్కింగ్ కండీషన్స్ పై కూడా కమిటీ వేశాము. నాలుగోది.. నిర్మాతలకు ప్రొడక్షన్ లో వేస్టేజ్ తగ్గింపు - వర్కింగ్ కండిషన్స్ - షూటింగ్ నంబర్ ఆఫ్ అవర్స్ జరగాలంటే ఏం చెయ్యాలన్న దానిపై కమిటీ వేశాం'' అని దిల్ రాజు చెప్పారు.
''ఫిలిం చాంబర్ ఆధ్వర్యంలో ఈ నాలుగు కమిటీలు పని చేస్తున్నాయి. కానీ మీడియాలో యూట్యూబ్ ఛానెల్స్ లో ఎవరికి ఇష్టమొచ్చింది వాళ్ళు ఊహించుకొని రాసేస్తున్నారు. ఇక్కడ క్లారిటీ ఏంటంటే.. ఛాంబర్ - కౌన్సిల్ - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెయిన్ బాడీగా పనిచేస్తాయి. డే టూ డే సమస్యలపై చర్చించడానికి యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ అంతా కలిసి గిల్డ్ పెట్టుకున్నాం. గిల్డ్ లో మాట్లాడుతున్నారు.. అక్కడే ఫైనల్ చేసేస్తున్నారు అని ఏదేదో అంటున్నారు. అలాంటిదేమీ లేదు. దేనికైనా ఛాంబర్ నిర్ణయమే ఫైనల్. మేం ఏం మాట్లాడినా ఛాంబర్ ద్వారానే బయటకు వెళ్తుంది'' అని తెలిపారు.
''మా అందరికీ నెలల తరబడి షూటింగ్స్ ఆపాలన్న ఉద్దేశ్యం లేదు. దీని వల్ల నిర్మాతలకు ఏదీ భారం కాకూడదని చూసుకుంటున్నాం. గత మూడు రోజుల నుంచి మూడు నాలుగు మీటింగ్స్ అయ్యాయి. నాలుగు కమిటీలు చాలా హోంవర్క్ చేస్తున్నాయి. కచ్చితంగా దీని తర్వాత ఇండస్ట్రీలో హెల్తీ వాతావరణంలో అందరూ వర్క్ చేసుకుంటారు''
''అందరూ కలిసి నాపైన ఎక్కువ బాధ్యతలు పెట్టారు. అన్నింటిలోనూ నాతో వర్క్ చేయిస్తున్నారు. నా పేరుని వాడుతూ రకరకాలుగా రాస్తున్నారు. అయినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే దిల్ రాజుకు పర్సనల్ అజెండా ఏమీ లేదు. అందరి సపోర్ట్ తో నేను సినిమా కోసం మాత్రమే పనిచేస్తున్నా. అందుకే నాకేం బాధ లేదు. మీడియా వారికి నా విన్నపం ఏంటంటే.. సినిమా గురించి రాయండి. వ్యక్తుల గురించి కాదు. ఇక్కడ వ్యక్తులు ఇవాళ ఉంటారు రేపు వెళ్లారు. తెలుగు సినిమా ఎలా ఉండాలనే దానిపై వర్క్ చేస్తున్నాం. దాని రిజల్ట్ త్వరలోనే వస్తుంది" అని దిల్ రాజు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సి. కల్యాణ్ మాట్లాడుతూ.. "సమస్యల పరిష్కారం కోసమే నిరవధికంగా షూటింగ్స్ బంద్ చేశాం. నిర్మాతల మధ్య ఎటువంటి బేధాభిప్రాయాల్లేవు. ఛాంబర్ - నిర్మాతల మండలి - ప్రొడ్యూసర్స్ గిల్డ్ లక్ష్యం ఒకటే.. అది సమస్యలు పరిష్కరించుకోవడమే" అని అన్నారు.