Begin typing your search above and press return to search.

#RRR 'డి' ఆ తర్వాత కూడా అంతకు మించి

By:  Tupaki Desk   |   1 March 2022 1:30 PM GMT
#RRR డి ఆ తర్వాత కూడా అంతకు మించి
X
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు రెండేళ్లుగా ఈ సినిమా అదుగో ఇదుగో అంటూ వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా ను విడుదల ఈనెల విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమా ను దానయ్య భారీ బడ్జెట్‌ తో నిర్మించిన విషయం తెల్సిందే. జక్కన్న తో సినిమా నిర్మించడం అంటే నక్క తోక తొక్కడమే. రూపాయి పెడితే పది రూపాయలు వెనక్కి వస్తాయని అంటారు.

దానయ్య కు కూడా ఆర్ ఆర్‌ ఆర్‌ ద్వారా భారీగా లాభాలు ఇప్పటికే రావడం మొదలైందని సమాచారం. టాలీవుడ్‌ లో ప్రస్తుతం దానయ్య టాప్ నిర్మాతగా కొనసాగుతున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన నుండి ముందు ముందు మరిన్ని భారీ సినిమాలు రాబోతున్నాయి. టాలీవుడ్‌ లో టాప్‌ హీరోలందరితో కూడా ఈయన సినిమాలు చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికిప్పుడు ఈయన నిర్మాణంలో తెరకెక్కబోతున్న సినిమాల విషయం హాట్ టాపిక్ గా ఉంది.

ఆర్ ఆర్ ఆర్‌ విడుదల కాకుండానే దానయ్య కన్ఫర్మ్‌ చేసుకున్న ప్రాజెక్ట్‌ ల విషయానికి వస్తే ప్రభాస్ తో ఒక సినిమా ను మారుతి దర్శకత్వంలో నిర్మించబోతున్నాడు. ఆ సినిమా గురించి భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదే ఏడాదిలో ఆ సినిమ విడుదల అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు.

చిరంజీవి తో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా ను దానయ్య నిర్మించబోతున్నాడు. అది రాబోయే నెల లేదా రెండు నెలల్లో పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

రామ్‌ చరణ్‌ కోసం ప్రశాంత్ నీల్ ను లైన్ లో పెట్టాడు. ఈ ఏడాది చివరి నుండి రామ్‌ చరణ్ మరియు ప్రశాంత్‌ నీల్‌ ల కాంబో మూవీ ని ఈయన మొదలు పెట్టబోతున్నాడు. ఇక పవన్ కళ్యాణ్‌ తో ఒక రీమేక్ ను దానయ్య నిర్మించబోతున్నాడు. ఆ రీమేక్ కు సాహో డైరెక్టర్ సుజీత్‌ దర్శకత్వం వహిస్తాడనే వార్తలు వస్తున్నాయి.

చిరంజీవి.. ప్రభాస్‌.. రామ్‌ చరణ్‌.. ప్రభాస్‌ వంటి స్టార్స్ తో మాత్రమే కాకుండా మరి కొందరికి కూడా అడ్వాన్స్ లను దానయ్య ఇచ్చాడట. అవి వచ్చే రెండేళ్లలో ఉండే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఆర్ ఆర్ ఆర్‌ తర్వాత దానయ్య నుండి రాబోతున్న సినిమాలు భారీ నుండి అతి భారీగా ఉండబోతున్నాయి. ఆర్ ఆర్‌ ఆర్ సినిమా కాకుండా రాబోయే రెండేళ్లలో దానయ్య నిర్మించబోతున్న సినిమాల ఖరీదు వెయ్యి కోట్లకు మించి ఉంటుందనే టాక్‌ వినిపిస్తుంది.