Begin typing your search above and press return to search.
సరోగసీ ద్వారా తల్లైన ఏక్తా కపూర్
By: Tupaki Desk | 31 Jan 2019 11:29 AM GMTప్రముఖ నిర్మాత అయిన ఏక్తా కపూర్ బాలీవుడ్ లో ఉండే విజయవంతమైన మహిళలలో ఒకరు. 43ఏళ్ళ ఏక్తా వివాహం చెసుకోకుండా ఇంకా సింగిల్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తూనే ఉంది. తాజాగా ఏక్తా సరోగసీ విధానం ద్వారా తల్లైందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. జనవరి 27 తేదీన ఆమెకు వేరే తల్లి గర్భంద్వారా ఒక మగబిడ్డ జన్మించాడని సమాచారం.
ఏక్తా సీనియర్ బాలీవుడ్ హీరో జితేంద్ర కుమార్తె అనే సంగతి తెలిసిందే. బాలాజీ టెలీ ఫిలిమ్స్ సంస్థపై ఆమె పలు విజయవంతమైన సీరియల్స్.. సినిమాలు నిర్మించారు. క్యూంకీ సాస్ బీ కబీ బహు థీ.. కుమ్ కుమ్ భాగ్య.. కుండలి భాగ్య.. యే మోహబ్బతేన్.. కసమ్ తెరే ప్యార్ కి.. బడే అచ్చే లగ్తీ హై లాంటి సీరియల్స్ తో పాటు డర్టీ పిక్చర్.. రాగిణి ఎమ్మెమ్మెస్.. షూట్ అవుట్ ఎట్ వడాలా.. వీరె ది వెడ్డింగ్.. హాఫ్ గర్ల్ ఫ్రెండ్ లాంటి చిత్రాలను నిర్మించారు.
ఏక్తా కుటుంబంలో ఇలా సరోగసీ విధానంలో బిడ్డకు జన్మనివ్వడం ఇది రెండో సారి. గతంలో ఏక్తా సోదరుడు తుషార్ కపూర్ కూడా పెళ్లి చేసుకోకుండానే సరోగసీ విధానంలో తండ్రయ్యారు. ఆయనకు లక్ష్య కపూర్ అనే పేరున్న బాబు ఉన్నాడు. తన తమ్ముడి స్ఫూర్తితో ఏక్తా కూడా అదే విధానంలో సింగిల్ పేరెంట్ గా మారడం విశేషం. మరో బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ కూడా సరోగసీ విధానంలో ట్విన్స్(ఒక పాప.. ఒక బాబు) కు సింగిల్ పేరెంట్ గా మారిన సంగతి తెలిసిందే.