Begin typing your search above and press return to search.

టాలీవుడ్ శాడిజంపై నిర్మాత ఫైరింగ్

By:  Tupaki Desk   |   26 Feb 2019 9:28 AM GMT
టాలీవుడ్ శాడిజంపై నిర్మాత ఫైరింగ్
X
ఆయ‌నో సీనియ‌ర్ నిర్మాత‌. క్యాసెట్లు అమ్ముకునే వాళ్ల‌ను కొంద‌రిని క‌లుపుకుని అప్ప‌ట్లోనే సొంతంగా బ్యాన‌ర్ పెట్టి సినిమాలు తీసారు. ఆరంభ‌మే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్టు కొట్టారు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా సినిమాలు నిర్మించి పెద్ద నిర్మాత‌నే అన్న పేరు తెచ్చుకున్నారు. క‌ట్ చేస్తే .. వ‌న్ ఫైన్ డే ఆయ‌న‌కు ఫ్లాపులు వెక్కిరించాయి. అనంత‌రం టాలీవుడ్‌ లో మారిన విలువ‌ల నేప‌థ్యంలో ప‌రిశ్ర‌మ నుంచి కాస్త దూరం జ‌రిగారు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు తిరిగి ఓ డ‌బ్బింగ్ రిలీజ్ తో ట‌చ్ లోకి వ‌చ్చారు.

అయితే ఈ డ‌బ్బింగ్ సినిమా రిలీజై స‌క్సెసైందా లేదా? అన్న‌ది అటుంచితే టాలీవుడ్ శాడిజంపై అత‌డు చేసిన ఓ వ్యాఖ్య వేడెక్కిస్తోంది. ఇంత‌కీ ఆయ‌నేమ‌న్నారు? అంటే.. ``నేను మ‌ద్రాసులో ఉన్న‌ప్పుడు శాడిజం లేదు. అక్క‌డ అంతా సినిమా స‌క్సెసైతే ఆనందించేవారు. శుభకాంక్ష‌లు చెప్పేవారు. పొరుగు నిర్మాత‌ బావుండాల‌ని కోరుకునేవారు. కానీ ఇక్క‌డ శాడిజం టూ మ‌చ్. స‌క్సెసైనా ఎందుకు అవ్వాలి? అనుకునే ర‌కాలు ఇక్క‌డ ఉన్నారు. ఆడు అయిపోయాడా.. ఈడు అయిపోయాడా? అంటూ చిల్ల‌ర‌గా మ‌ట్లాడుకుంటున్నారు... అంటూ త‌న‌లోని బాధ‌ను వెల్ల‌గ‌క్కారు. ఇంత‌కీ ఆయ‌న పేరేంటి? ఏఏ సినిమాలు చేశారు? అంటారా?

ఆయ‌న పేరు గోపినాథ్ ఆచంట‌. సీనియ‌ర్ నిర్మాత‌. సౌత్ లేడీ సూప‌ర్ స్టార్‌ నయనతార నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ `ఇమైక్క నోడిగ‌ల్` ను తెలుగులో అంజలి సిబిఐ పేరుతో విడుదల చేశారు. ఆర్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు దర్శకత్వం వహించిన ఈ మూవీలో న‌య‌న‌తార సిబిఐ ఆఫీస‌ర్ పాత్రలో నటించిన సంగ‌తి తెలిసిందే. త‌మిళ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్. తెలుగులో ఫ‌ర్వాలేద‌ని ఆయ‌నే చెప్పారు. 14, 15 వ‌య‌సులోనే నాట‌కం .. న‌టన .. సినిమా వీటిపై ఇష్టంతోనే సినిమా రంగం వైపు వచ్చాను. అయితే అప్ప‌ట్లో సినిమా ప్ర‌పంచం ఎలా ఉంటుందో ద‌గ్గ‌ర‌గా చూశాక‌.. ఇక్క‌డ‌ బాగా డ‌బ్బున్న వాడిగా వెళ్లాలి .. మామూలుగా వెళితే క‌ష్టం అని అర్థం చేసుకున్నాన‌ని తెలిపారు. రాజేంద్ర‌ప్ర‌సాద్ `ఇద్ద‌రు పెళ్లాల ముద్దుల పోలీస్` చిత్రంతో నిర్మాత‌ను అయ్యాను. ఆ చిత్రాన్ని భాగస్వాముల‌తో క‌లిసి చేశాను.

రాజేంద్ర ప్ర‌సాద్ - దివ్య వాణి జంటా రేలంగి న‌రసింహారావు ద‌ర్శ‌క‌త్వ ంలో చేశాం. రాజేంద్ర ప్ర‌సాద్ ద్విపాత్రాభిన‌యం చేసిన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకుంది. ప‌రిశ్ర‌మ‌లో స‌క్సెస్ వ‌స్తే ఆ త‌ర్వాత ప‌ని చాలా సులువు అవుతుంది. ఆ త‌ర్వాత రెండో సినిమా దాస‌రి నారాయ‌ణ‌రావుతో .. మూడో సినిమా ఈవీవీతో జంబ‌ల‌కిడి పంబ చేశాన‌ని తెలిపారు. అప్ప‌ట్లో భ‌గ‌వాన్ - దాన‌య్య ఆడియో క్యాసెట్లు అమ్ముకునే వారు. వాళ్లు ఇంటికెళుతూ మా ఆఫీస్ లో క‌లిసేవారు. సినిమా నిర్మాణంలో భాగస్వామ్య ం అడిగారు. ఆ త‌ర్వాత భాగ‌స్వామ్యంలో ఈవీవీ తో సినిమా చేశామ‌ని తెలిపారు. బాల‌కృష్ణ - సౌంద‌ర్య జంట‌గా ఎస్వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వ ంలో `టాప్ హీరో` చిత్రం చేశాను. ర‌విరాజ పినిశెట్టి తో దేవుళ్లు, జ‌గ‌ప‌తిబాబు గారితో `నాలో ఉన్న ప్రేమ `చిత్రం తీశాను. ఇంత‌కాలానికి అంజ‌లి ఐపీఎస్ తో మ‌రోసారి సినిమాలు రీస్టార్ట్ చేశామ‌ని వెల్ల‌డించారు. ప్ర‌చారం క‌లిపి రెండున్న‌ర కోట్లు పెడితే తొలి రెండ్రోజుల్లో కోటి పైగా వ‌సూలైంద‌ని తెలిపారు.