Begin typing your search above and press return to search.
ఉదయ్ కిరణ్ మరణంపై నిర్మాత సంచలన వ్యాఖ్య!
By: Tupaki Desk | 25 Dec 2019 4:25 PM GMTచిత్రం.. 25 మే 2000లో రిలీజైంది. అప్పట్లో ట్రెండ్ సెట్టింగ్ మూవీ ఇది. ఎన్నో చిన్న చిత్రాలకు ఒకరకంగా ధైర్యాన్నిచ్చింది. కొత్త తరహా పోకడలకు.. న్యూ ఏజ్ మేకింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఈ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి దూసుకొచ్చిన యువ కెరటం ఉదయ్ కిరణ్. ఈ సినిమా తరువాత వరుస సక్సెస్ లతో ఇండస్ట్రీ పెద్దలకే విస్మయాన్ని.. ఆశ్చర్యాన్ని కలిగించాడు. ఆ తరువాత ఉదయ్ కిరణ్ నటించిన నువ్వునేను-మనసంతా నువ్వే వరుసగా హిట్ లు కావడంతో హ్యాట్రిక్ హీరోగా రికార్డు సాధించారు.
ఎలాంటి సినీనేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి వరుస హిట్లతో సంచలనం సృష్టించిన ఉదయ్ కిరణ్ ని చూసి ఇండస్ట్రీ అంతా చర్చించుకుంది కూడా. అతని క్రేజ్ చూసి మురిసిపోయిన మెగాస్టార్ చిరంజీవి అతన్ని అల్లుడిని చేసుకోవాలని ముచ్చటపడ్డారు. అద్భుతమైన కెరీర్ రారమ్మని పిలుస్తున్నవేళ చిరు పెళ్లి ప్రస్థావనతో ఉదయ్ కిరణ్ కెరీర్ ఒక్కసారిగా తలక్రిందులైపోయిందని రూమర్లు వచ్చాయి. 14 చిత్రాలకు సైన్ చేసి ఫుల్ బిజీగా వున్న ఉదయ్ కిరణ్ చిరు కూతురు పెళ్లి ప్రస్థావన.. వివాహం రద్దు కావడం వంటి కారణాలతో చేతిలో వున్న 14 సినిమాలు పోయి ఖాళీ అయిపోయాయన్న ప్రచారం ఊదరగొట్టారు. దీనికి కారణం ఎవరంటే చిరంజీవే అంటూ ఒక సెక్షన్ కోడై కూసింది. ఆ తరువాత ఉదయ్ కి పెళ్లవ్వడం.. రకరకాల ఆర్థిక కారణాలతో ఫ్యామిలీ రీజన్స్ తో ఉదయ్ 2014లో తన ఇంట్లోనే ఉరివేసుకుని చనిపోవడం సంచలనమైంది. అయితే ఆ ఆత్మహత్యకు .. చిరు కుమార్తెతో పెళ్లి జరగకపోవడానికి ముడి వేస్తూ ఒక సెక్షన్ చేసిన దుష్ప్రచారం హైలైట్ అయ్యింది.
అయితే అంతా అనుకున్నట్టుగా ఉదయ్ ఆత్మ హత్య వెనకాల ఆ పెద్ద హీరో ప్రమేయం లేదని తర్వాత ప్రూవైంది. ఈ హీరో మరణంతో చిరంజీవికి లింక్ ఉందని చాలా మంది ప్రచారం చేసినా.. ఉదయ్ ఆత్మహత్యకు చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదని స్వయంగా హీరోగారి అక్క శ్రీదేవి చెప్పారు. ఆ నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన తర్వాత కూడా చిరంజీవి తన తమ్ముడి కెరీర్ కు చాలా ప్రాముఖ్యత ఇచ్చారని.. పలు మార్లు ఇంటికి వచ్చి మరీ కలిసారని చెప్పారు శ్రీదేవి. ఇక ఇప్పుడు ఓ నిర్మాత కూడా ఉదయ్ మరణానికి చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీనిచ్చారు. ఉదయ్ కిరణ్ హీరోగా రామలక్ష్మి సినీక్రియేషన్స్ పతాకంపై లగడపాటి నిర్మించిన `వియ్యాల వారి కయ్యాలు` సినిమా రిలీజ్ సందర్భంలో చిరుని ఇదే విషయంపై ప్రశ్నిస్తే.. ఆ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారని.. ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారని ఆ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చెప్పుకొచ్చారు. దీంతో చిరు కారణంగా ఉదయ్ కిరణ్ చనిపోయారన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేలిపోయింది. మెగాస్టార్ పై ఒక సెక్షన్ మీడియా అదే పనిగా తప్పుడు వార్తల్ని నూరిపోస్తుందని ఇప్పటికీ మెగాభిమానులు భావిస్తుంటారు. సదరు మీడియా ప్రాపకమే చిరుపై తప్పుడు అభిప్రాయం పాదుకొనేలా చేసిందన్న ఫైరింగ్ అభిమాన సంఘాల మీటింగుల్లో వినిపిస్తుంటుంది.