Begin typing your search above and press return to search.
హీరొయిన్లు సెక్స్ వర్కర్లు అన్న నిర్మాత భార్య
By: Tupaki Desk | 21 March 2018 1:09 PM GMT ఖచ్చితమైన కారణం ఎవరు చెప్పలేకపోతున్నారు కాని కాస్టింగ్ కౌచ్ గురించి నటీనటుల పడక సంబంధాల గురించి ఎన్నడు లేని స్థాయిలో సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో హీరొయిన్ మాధవి లత మొదలుకొని నిన్న శ్రీరెడ్డి వరకు వివిధ రూపాల్లో తమ అభిప్రాయలను ఓపెన్ గానే వ్యక్తం చేసారు. కొందరు పేర్లు చెప్పేయగా కొందరు నేరుగా పేర్లు ప్రస్తావించకుండా జస్ట్ క్లూ ఇచ్చి వదిలేసారు. తాజాగా తమిళ నిర్మాత, హీరో సూర్య బంధువు జ్ఞానవేల్ రాజా భార్య నేహా ఇంకాస్త ఓపెన్ గా అభిప్రాయం వ్యక్తం చేయటం సంచలనం రేపుతోంది. పరిశ్రమలో కొందరు హీరొయిన్లు పెళ్ళైన నిర్మాతలనే టార్గెట్ గా పెట్టుకుని అవకాశాల కోసం పడక పంచుకోవడానికి కూడా రెడీ అవుతారని చెప్పిన నేహా వాళ్ళను సెక్స్ వర్కర్స్ కంటే దారుణంగా ఉంటారని వర్ణించడం కలకలం రేపుతోంది. ఎవరి గురించి అన్నది చెప్పలేదు కాని నేహా కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
వీళ్ళను కొంపలు కూల్చే వాళ్ళుగా పోల్చిన నేహా అలాంటి హీరొయిన్ల లిస్టు తన వద్ద ఉందని త్వరలోనే బయట పెడతానని చెప్పడం కొసమెరుపు. దీనికి నెటిజెన్లు భారీగా స్పందించారు. కొందరు సపోర్ట్ చేయగా మరికొందరు మీ భర్త జ్ఞానవేల్ రాజా అటువంటి వాటిని ప్రోత్సహించారు కాబట్టి మీకు ఈ విషయాలు తెలిసి ఉంటాయని ముందు ఆ నిజాలు చెప్పండి అంటూ నిలదీసారు. చర్చ ఎక్కడికో వెళ్తోంది అని గమనించిన నేహా వెంటనే ఆ ట్వీట్లను తీసేసి ఏమార్చే ప్రయత్నం చేసింది కాని అప్పటికే ఇవి అందరి స్మార్ట్ ఫోన్స్ లో చక్కర్లు కొట్టడం మొదలు పెట్టాయి. తమిళ్ లో భాగమతి ని డబ్ చేసి విడుదల చేసింది జ్ఞానవేల్ రాజానే. గ్రీన్ స్టూడియోస్ పేరుతో సూర్య, కార్తి నటించిన ప్రతి డబ్బింగ్ సినిమా తెలుగులో ఈయన బ్యానర్ పేరు మీదే విడుదల అవుతుంది.
ఇలా పేర్లు చెప్పకుండా ఇండస్ట్రీ పరువును బజారుకు ఈడుస్తున్నారని, పేర్లు చెప్పే ఉద్దేశం లేనప్పుడు సైలెంట్ గా ఉండకుండా ఏదో సంచలనం కోసం ఇలాంటి కామెంట్స్ చేయటం పట్ల పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నేహా కామెంట్స్ గురించి జ్ఞానవేల్ రాజా ఇంకా రెస్పాండ్ కాలేదు. నేహా కాస్ట్యూమ్ డిజైనర్. సూర్య సినిమాలకు వర్క్ చేసారు కూడా. మరి నేహా చెప్పిన వాటికి ఫ్యామిలీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో వేచి చూడాలి