Begin typing your search above and press return to search.
కోడి వారసురాలు గా దివ్య దీప్తి కెప్టెన్ కుర్చీ?
By: Tupaki Desk | 14 Sep 2022 1:30 PM GMTదివంగత దర్శకుడు కోడి రామకృష్ణ వారసురాలిగా కోడి దివ్య దీప్తి నిర్మాతగా పరిచయం అవుతోన్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా ఎన్నో సినిమాలకు పనిచేసిన రామకృష్ణ ఏనాడు పిల్లల్ని ఈ రంగంవైపు తీసుకొచ్చింది లేదు. పిల్లల్ని వివిధ రంగాల్లో స్థిరపరిచి ఆయన మాత్రమే తెర ముందు కనిపించేవారు. అయితే ఇప్పుడాయన వారసత్వాన్ని కొనసాగించడానికి దివ్య దీప్తి ముందుకొచ్చారు.
నాన్న లేకపోయిన ఆ లోటును ఉన్నంతలో తాను భర్తీ చేస్తానంటూ తెర వెనుక పాత్ర పోషిస్తున్నారు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' చిత్రంతో దివ్య దీప్తి నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈనెల 16న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా దివ్యదిప్తి కెరీర్ ప్లానింగ్ గురించి ఆసక్తికరంగా స్పందించారు.
'మంచి సినిమా నిర్మాంచాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉంది. నిర్మాణం అన్నది సవాళ్లతో కూడుకున్నదే. అయినా ఓ అనుభవంలా ఉండాలని అన్నీ నేర్చుకుంటూ ప్రయాణం మొదలు పెట్టి దిగ్విజయంగా పూర్తిచేసా. సినిమా చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది. అలాగే కథల విషయంలో నాకంటూ ప్రత్యేకమైన అభిరుచి ఉంది.
ప్రయాణం ఇప్పుడే మొదలైంది. భవిష్యత్ తో భారీ బడ్జెట్ సినిమాలు కూడా నిర్మిస్తాను. మంచి కథలు కుదిరిప్పుడు వాటి కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేయడానికి వెనుకాడను. ఇండస్ర్టీ బిడ్డగా అది నా బాధ్యత భావిస్తాను. అలాగే నిర్మాతగానే కాదు..దర్శకురాలిగాను రాణించాలని కొన్ని ప్రణాళికలున్నాయి. నా ఐడియాలికి దృశ్యరూపం ఇస్తాను.
చిన్న నాటి నుంచి దర్శకత్వం పై ఆసక్తి ఉంది. నాన్న గారు ఉన్నప్పుడే మూడు నాలుగు కథలు రాసిపెట్టాను. భవిష్యత్ లో అవి తెరకెక్కుతాయి. ఇటీవల టాలీవుడ్ లో చాలా మార్పులొచ్చాయి. కొత్త కథలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కొత్త వాళ్లని బాగా ప్రోత్సహిస్తున్నారు' అని అన్నారు.
దర్శకుడిగా కోడి రామకృష్ణ ది సుదీర్ఘ ప్రస్థానం. ఎన్నో సినిమాలకు పనిచేసారు. టాలీవుడ్ కి ఆయన సేవలు చిర స్మరణీయం. ఎంతో మంది స్టార్స్ ని డైరెక్ట్ చేసారు. అంతటి లెజెండరీ దర్శకుడు వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని దివ్య దీప్తి వస్తుందంటే? అంచనాలు భారీగానే ఉంటాయి. వాటిని అందుకోవడానికి ఆమె కూడా అంతే శ్రమించాల్సి ఉంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.