Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్ తీసుకునే అల‌వాటుంది ! - నిర్మాత కె.పి.చౌద‌రి

By:  Tupaki Desk   |   23 Jun 2023 7:43 PM GMT
డ్ర‌గ్స్ తీసుకునే అల‌వాటుంది ! - నిర్మాత కె.పి.చౌద‌రి
X
డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత కేపీ చౌదరిని హైద‌రాబాద్ రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. గోవా నుంచి డ్రగ్స్ తరలిస్తుండగా చౌదరి పోలీసులకు ప‌ట్టుబ‌డ్డార‌ని క‌థ‌నాలొచ్చాయి .ఉప్పర్ పల్లి కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం చర్లపల్లి జైలులో 14 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్న చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకుని రాజేంద్రనగర్ పీఎస్ కు తరలించారు. రేపు ఆయనను విచారించనున్నారు. టాలీవుడ్ లో ఇత‌ర‌ నిర్మాతలు తార‌లతో ఏమైనా లింకులు ఉన్నాయా? అనే విష‌య‌మై లోతుగా విచారించే అవకాశం ఉంది.

తాజాగా నిర్మాత కేపీ చౌద‌రి త‌న‌కు డ్ర‌గ్స్ తీసుకునే అల‌వాటుంద‌ని అయితే తాను ఎలాంటి క్ర‌య‌విక్ర‌యాలు కొన‌సాగించ‌లేద‌ని నిజాలు విచార‌ణ‌లో నిగ్గు తేల‌తాయ‌ని వ్యాఖ్యానించారు. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు కాల‌మే స‌మాధానం చెబుతుంద‌ని ఆయ‌న అన్నారు.

కేసు పూర్వాప‌రాల్లోకి వెళితే...!

సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ తో సినీ డ్రగ్స్ కు సంబంధించిన లింకులు తెరపైకి వచ్చాయి. కేపీ చౌదరి అరెస్ట్ తో పలువురు ప్రముఖులు అయోమయంలో పడ్డారని ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి. డ్రగ్స్‌ వ్యాపారి రోషన్‌ విచారణలో కేపీ చౌదరి ఉదంతం వెలుగులోకి వచ్చింది.

చాలా మంది సెలబ్రిటీలు ప్రైవేట్ పార్టీలకు హాజరవుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీని ఆధారంగా కేపీ చౌదరి నిర్వహించిన పార్టీలకు హాజరైన ప్రముఖుల జాబితాను పోలీసులు సిద్ధం చేస్తున్నారు.

గోవా హైదరాబాద్ లలో ప్రైవేట్ పార్టీలు నిర్వహిస్తున్న కేపీ చౌదరికి చెందిన 4 మొబైల్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ 4 ఫోన్ల నుంచి కాల్ డేటా తీసుకుంటున్నారు. ఇద్దరు హీరోయిన్లు నలుగురు మహిళా ఆర్టిస్టులు.. డ్రగ్స్ వ్యవహారంపై ఓ దర్శకుడితో కేపీ చౌదరి చేసిన చాట్ గుర్తించబడిందని ప్ర‌ముఖ మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. డ్రగ్ కింగ్ నైజీరియన్ గాబ్రియేల్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.

ఈ క్రమంలో కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. గోవా నుంచి 100 కొకైన్ ప్యాకెట్లు తీసుకురాగా.. 90 ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన 10 ప్యాకెట్లను ఎవరు విక్రయించారనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.