Begin typing your search above and press return to search.
'జెంటిల్ మేన్ 2' చిత్రాన్ని అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్...!
By: Tupaki Desk | 10 Sep 2020 5:32 PM GMTతమిళ మలయాళ భాషల్లో ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన ప్రొడ్యూసర్ కేటి కుంజుమోన్.. 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ సినిమాలు ప్రొడ్యూస్ చేయనున్నట్లు ప్రకటించారు. రజినీకాంత్ - కమల్ హాసన్ - మమ్ముట్టి - మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించిన కేటి కుంజుమోన్.. 'కింగ్' అక్కినేని నాగార్జున తో 'రక్షకుడు' సినిమా నిర్మించాడు. భారతదేశం గర్వించదగ్గ నిర్మాతల్లో ఒకరైన శంకర్ ఫస్ట్ సినిమా 'జెంటిల్ మేన్' సినిమాని కూడా కేటి కుంజుమోన్ నిర్మించాడు. 1993లో తమిళం తెలుగు భాషల్లో రూపొందిన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించి హీరో అర్జున్ కెరీర్ లో మైలురాయిగా నిలిచింది. విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ.. అవినీతిపై పోరాడే ఓ యువకుడి కథతో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయం నమోదు చేయడమే కాక అనేక అవార్డులను కూడా అందుకుంది. అయితే ఇప్పుడు 'జెంటిల్ మేన్' చిత్రానికి సీక్వెల్ చేయబోతున్నట్లు కుంజుమోన్ ప్రకటించారు.
కాగా 1999లో విజయ్ హీరోగా నటించిన 'ఎండ్రెండ్రం కాదల్' అనే సినిమా తర్వాత కుంజుమోన్ మరో సినిమా నిర్మించలేదు. ఇన్నేళ్ల తర్వాత తన నిర్మాణంలో భారీ విజయాన్ని సాధించిన 'జెంటిల్ మేన్' చిత్రానికి పార్ట్ 2 చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. జెంటిల్ మేన్ ఫిలిం ఇంటర్నేషనల్ అనే బ్యానర్ లో మొదటి భాగానికి రెండింతలు ఉండేలా 'జెంటిల్ మేన్ 2' చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు నిర్మాత కేటి కుంజుమోన్. ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలలో నిర్మించనున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా కుంజుమోన్ మాట్లాడుతూ.. 'జెంటిల్ మేన్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో అనువదించబడి మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. అందుకే 'జెంటిల్ మేన్ 2' చిత్రాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా రూపొందిస్తున్నాం" అని పేర్కొన్నారు.