Begin typing your search above and press return to search.
శ్రీరెడ్డికి కోలీవుడ్ ఓపెన్ ఆఫర్.. కానీ కండీషన్
By: Tupaki Desk | 26 July 2018 5:28 AM GMTటాలీవుడ్ లోని కాస్టింగ్ కౌచ్ ను వెలికితీసి దండయాత్ర చేసిన శ్రీరెడ్డికి సానుభూతి తప్పితే సినిమా అవకాశాలైతే రాలేదు.. ప్రముఖ సినీ నిర్మాత కొడుకు బండారం బయటపెట్టి .. పవన్ కళ్యాణ్ ను తిట్టి పాపులర్ అయిన ఆమెకు సినిమా అవకాశాలు వస్తాయని ఆశించింది.. కానీ ఇండస్ట్రీ పెద్దల ఆగ్రహానికి గురికావద్దనే ఉద్దేశంతో ఏ నిర్మాత ఆమె తో సినిమాలు తీయడానికి ముందుకు రాలేదు. దీంతో టాలీవుడ్ లో వర్కవుట్ కాలేదు.
హైదరాబాద్ లో పరిస్థితులు ఎంత తిట్టినా దారికి రాకపోవడంతో శ్రీరెడ్డి ప్రస్తుతం తన మకాంను చెన్నైకి మార్చింది. కొద్దిరోజులుగా అక్కడే ఉంటూ వివిధ న్యూస్ చానెల్స్ తిరుగుతూ కోలీవుడ్ లోని కాస్టింగ్ కౌచ్ ను వెలికితీస్తోంది. ఇప్పటికే దర్శకులు మురగదాస్ - రాఘవలారెన్స్ - నటుడు శ్రీరామ్ తనను మోసం చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే..
తాజాగా శ్రీరెడ్డి పడిన కష్టాలు చూసి ఒకప్పటి నటి, ప్రస్తుత నిర్మాత కుట్టి పద్మిని స్పందించారు.శ్రీరెడ్డి ఒప్పుకుంటే ఆమెతో తను తీస్తున్న సీరియల్స్, వెబ్ సిరీస్ లలో అవకాశం ఇస్తానని ప్రకటించారు. కుట్టి పద్మిని ఫేమస్ బుల్లితెర ప్రొడ్యూసర్. ఆమె తీసిన సీరియల్స్ తమిళంలో బాగా హిట్ అయ్యాయి.. కోలీవుడ్ లో ఒకప్పుడు వెలుగు వెలిగిన ఎంతో మంది ఆమె సీరియల్స్ లో నటిస్తున్నారు. ఎంతో మంది యువ నటులను ఆమె సీరియల్స్ ద్వారా బుల్లితెరకు పరిచయం చేసింది. దీంతో ఇప్పుడు శ్రీరెడ్డికి ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. అయితే ఓ కండీషన్ పెట్టింది.
కోలీవుడ్ లో 1983 నుంచి కాస్టింగ్ కౌచ్ ఉందని.. కేవలం ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం తమిళ సినీ పరిశ్రమపై బురదజల్లడం ఆపివేస్తే మంచిదని శ్రీరెడ్డికి సలహా ఇచ్చింది.. శ్రీరెడ్డి వ్యక్తిగతం చాలా నష్టపోయిందని.. ఆమెను ఆదుకోవడానికి ముందుంటానని భరోసా ఇచ్చింది..మరి కుట్టి పద్మిని ఇచ్చిన ఈ ఆఫర్ ను అందిపుచ్చుకొని శ్రీరెడ్డి నటిగా స్థిరపడుతుందా లేదా.. అవే ఆరోపణలతో అభాసుపాలవుతుందా అనేది చూడాలి..