Begin typing your search above and press return to search.
మాస్టర్ సినిమా రిలీజ్ ఆపేయండి: సీఎంకి లేఖ రాసిన నిర్మాత
By: Tupaki Desk | 5 Jun 2020 10:51 AM GMTతమిళ స్టార్ ఇళయదళపతి విజయ్ నటించిన కొత్త సినిమా ‘మాస్టర్’ ఎప్పుడో విడుదలకు సిద్ధమైంది. ‘ఖైదీ’ ఫేమ్ లోకేశ్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటించారు. అయితే లాక్‌డౌన్ కారణంగా ‘మాస్టర్’ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఇటీవలే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరోవైపు మనిషి మనిషికి మధ్య సామాజిక దూరం నిబంధనలను పాటిస్తూ జులై నుంచి థియేటర్లు రీ ఓపెనింగ్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. థియేటర్లు ఓపెన్ కాగానే మొదటగా ‘మాస్టర్’ సినిమాను విడుదల చేయాలని తమిళ థియేటర్ల యజమానులు కోరుతున్నారట. అయితే విజయ్ కి భారీ ఫాలోయింగ్ ఉండటం వలన థియేటర్ల యజమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు.
అయితే రజినీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ విజయ్ కే ఉంది కాబట్టి.. ఈ చిత్ర ప్రదర్శనతో థియేటర్లు జనాలతో నిండిపోతాయి. ఈ నేపథ్యంలో తమిళ సీనియర్ దర్శకనిర్మాత కేయార్.. ‘మాస్టర్’ విడుదల గురించి సీఎంకు లేఖ రాశారు. థియేటర్లు ఓపెన్ అయిన వెంటనే మొదటగా ‘మాస్టర్’ సినిమాను ప్రదర్శించడానికి పర్మిషన్ ఇవ్వొద్దని కోరారు. ఈ మాటకు అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కానీ ఎందుకో క్లారిటీ ఇచ్చారు. మాస్టర్ సినిమాను ఫస్ట్ విడుదల చేస్తే ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని, దానివల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అదే జరిగితే విజయ్‌కి ఉన్న గుడ్ నేమ్ పోతుందని కేయార్ తెలిపారు. ఆర్థిక పరిస్థితి కంటే ముందు ప్రజల సంక్షేమం ముఖ్యమని ఆయన వెల్లడించారు. సినీ నిర్మాతలకు విధించే 26 శాతం ఎంటర్టైన్మెంట్ టాక్స్.. రానున్న మూడు నెలలు మాఫీ చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అయితే ఈ వార్త తెలిసిన నెటిజన్లు విజయ్ ఫ్యాన్స్ కూడా వాస్తవమే అనకతప్పదు మరి!