Begin typing your search above and press return to search.
మళ్లీ మీరంతా మీసం మెలేసి తొడగొట్టేలా మరో సినిమా చేస్తాం!
By: Tupaki Desk | 13 March 2022 2:35 AM GMTబాలకృష్ణ తన స్థాయికి తగిన హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తుండగా దక్కిన అనూహ్యమైన విజయమే 'అఖండ'. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. తొలి రోజు నుంచే కొత్త రికార్డులను నమోదు చేయడం మొదలుపెట్టిన ఈ సినిమా, నిన్నటితో 100 రోజులను పూర్తిచేసుకుంది. కర్నూల్ లో జరిగిన ఈ 100 రోజుల పండుగలో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ .. "ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి ఇక్కడికి వచ్చాము.
ఇంతదూరం ప్రయాణం చేస్తూ వచ్చినప్పటికీ మా ఊరికి వచ్చినట్టుగానే ఉంది తప్ప, బయట ఊరికి వచ్చినట్టుగా లేదు. మాకు అనిపించింది మాకు ఇచ్చేటప్పుడు మీ కర్నూల్ ను కూడా కలిపి ఇస్తే బాగుండేదని.
మేము మీకు కృతజ్ఞతలు చెప్పాలని వస్తే .. ఇక్కడ ఇంతమంది జనాలను చూసిన తరువాత మీరే మాకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చారేమోనని అనిపిస్తోంది. ఒక సినిమా 100 రోజులు ఆడటమనేది నేను ఒకప్పుడు విన్నాను. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కరోనా సమయంలో కూడా ఈ సినిమా 100 రోజుల దిశగా పరుగులు తీయడం విశేషం.
ప్రపంచం మొత్తంలో గడచిన రెండేళ్లలో చూసుకుంటే, పాన్ ఇండియా .. పాన్ వరల్డ్ అని చెప్పుకుంటున్న సినిమాల వసూళ్లన్నీ కలుపుకున్నా, తెలుగులో ఒక 'అఖండ' .. ఒక 'పుష్ప' సినిమాకి వచ్చినంత కలెక్షన్ లేదు. ఒక సినిమాను మీరు ఆదరించడమంటే కొన్ని వేల కుటుంబాలకు మీరు ఒక భరోసా ఇచ్చినట్టు.
అందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాలకృష్ణగారి అభిమానులు మీసం మెలేసి తొడగొట్టే సినిమా ఒకటి అతి త్వరలో ఆయనతో చేయాలని నేను ఆశిస్తున్నాను. ఒక మంచి రోజును చూసుకుని ఆయనను కలవడం జరుగుతుంది. అలాంటి సినిమాతో మళ్లీ మీ ముందుకు వస్తాము" అని చెప్పుకొచ్చాడు.