Begin typing your search above and press return to search.
ఆ సొమ్ములన్నీ బ్లాక్..అగ్రనిర్మాతలో టెన్షన్స్!
By: Tupaki Desk | 8 Jun 2020 12:10 PM GMTప్రపంచవ్యాప్తంగా మహమ్మారీ టెన్సన్స్ అన్నీ ఇన్నీ కావు. ఎక్కడి పెట్టుబడులు అక్కడ లాక్డ్. ఎక్కడ కార్యకలాపాలు అక్కడ నిలిచిపోవడంతో పెట్టుబడుల రికవరీ ఎలానో అర్థం గాక తలలు పట్టుకుంటున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు నిపుణులు సైతం ఏదీ చేయలేని పరిస్థితి.
అలాగే టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ నిర్మాత కం పంపిణీదారుడు అలానే బుక్కయిపోయానని కలతకు గురవుతున్నారట. ఆయన గారి పెట్టుబడులు ఇప్పటికే ఓ మూడు సినిమాలపై పెట్టారు. వీటిలో ఓ అగ్ర హీరో సినిమా కోసమే 50కోట్ల పారితోషికం ఇవ్వడమే గాక భారీగా ఖర్చు చేస్తున్నారు. అయితే ఆ సినిమా ఈ ఏడాది రిలీజయ్యే సీన్ కనిపించడం లేదు. రిలీజైనా రిటర్నులు రావాలంటే జనాల్ని థియేటర్లకు భారీగా రప్పించాలి. కానీ ఈ వైరస్ టెన్షన్స్ లో కష్టమేనని విశ్లేషిస్తున్నారట.
మరోవైపు ఓ హిందీ డబ్బింగుని నిర్మించే బాధ్యత ఈ ఏడాది నెత్తికెత్తుకోవడం తనకు ఏమాత్రం కలిసి రాలేదు. తెలుగులో క్లాసిక్ హిట్ గా నిలిచిన చిత్రాన్ని హిందీలో ప్రముఖ హీరోతో రీమేక్ చేస్తూ అక్కడా పెద్దగానే పెట్టుబడులు పెట్టేశారు మరి. అయితే అది కూడా వచ్చే ఏడాది రిలీజవుతుంది కాబట్టి ఆ పెట్టుబడీ ఇప్పట్లో వెనక్కి రానట్టే. పోనీ రిలీజ్ కి రెడీగా ఉన్న వేరే మీడియం బడ్జెట్ సినిమా వల్ల ఏదైనా కలిసొస్తుందా? అంటే థియేటర్లకు జనం వస్తారా రారా? అన్న టెన్షన్ అలానే ఉండిపోయిందట. దీని పర్యవసానం 150-200 కోట్లు మిడిల్ లోనే స్టక్ అయిపోయిందన్న ఆవేదనగా మారిందట.
సదరు అగ్ర నిర్మాత కం డిస్ట్రిబ్యూటర్ ఊహించని ఈ విపత్తు తచ్చిన తంటాని తలుచుకుని చాలా ఇదైపోతున్నారట. కరోనా కొట్టిన దెబ్బ మామూలుగా లేదని ఫీలవుతున్నారట. ఒకే ఒక్క నిర్మాత విషయంలోనే ఇంత నష్టం కష్టం కనిపిస్తుంటే .. ఇండస్ట్రీలో ఉన్న ఇతర నిర్మాతలందరి నష్టాల్ని అంచనా వేస్తే వందల కోట్లు గల్లంతేనని విశ్లేషిస్తున్నారు.