Begin typing your search above and press return to search.
VD 12: కాపీ అంటారేంటి? అది కో ఇన్సిడెంట్..!
By: Tupaki Desk | 10 May 2023 6:51 PM ISTప్రతి ఒక్క దర్శకుడు, హీరో, నిర్మాత.. ఇలా ఎవరైనా సరే, ప్రేక్షకులకు గొప్ప చిత్రాలే అందించాలని అనుకుంటారు. ఈ క్రమంలో కొందరు ఇతర భాషల సినిమాలను కాపీ చేసే అవకాశం ఉంది. అచ్చంగా సినిమా స్టోరీ కాపీ చేయకుండా కొందరు ఆ కథను ఇన్సిపిరేషన్ గా తీసుకుంటారు. మరి కొందరు సినిమాలోని కొన్ని పాత్రలను మాత్రమే తీసుకుంటారు. ఇంకొందరు మూవీ పోస్టర్ డిజైన్ తీసుకున్నవారు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని కొందరు దర్శక నిర్మాతలు డైరెక్ట్ గా చెప్పేస్తారు. ఫలానా సినిమా నుంచి ప్రేరణ పొందామని చెబుతుంటారు. కొందరు మాత్రం అంగీకరించరు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా? అక్కడికే వస్తున్నాం. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న ఓ సినిమా విషయంలో ఈ కాపీ వివాదం ఏర్పడటం గమనార్హం.
గౌతమ్ తిన్ననూరి దర్శకుడిగా, సితార కాంబినేషన్ లో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా పేరు ఇంకా ఖరారు చేయలేదు కానీ, సినిమాని మాత్రం ఎనౌన్స్ చేశారు. విజయ్ 12వ చిత్రంగా ఇది తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ పోస్టర్ విడుదల చేశారు. అక్కడే కాపీ వివాదం మొదలైంది.
ఈ సినిమా పోస్టర్ అచ్చం ఆర్గో అనే సినిమా పోస్టర్ లాగా ఉండటం గమనార్హం. ఆర్గో పోస్టర్ లో హీరో ముఖంలోని కింది భాగాన్ని చూపిస్తే, విజయ్ దేవర కొండది ముఖంలోని పై భాగం చూపించారు. మిగిలినదంతా సేమ్ టూ సేమ్ ఉంది. హీరో ఫోటోలను నీట్ గా కత్తెరతో కట్ చేసినట్లుగా, అది కూడా సగం భాగం ఉండేలా డిజైన్ చేశారు.
చిన్న పిల్లాడికి చూపించినా, ఈరెండూ ఒకేలా ఉన్నాయని చెప్పేయగలడు. ఇంకేముంది కాపీ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కేవలం పోస్టరే కాపీ చేశారా లేక, స్టోరీ కూడా కాపీ చేశారా అంటూ కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు. ఈ కాపీ చేశారంటూ వచ్చే ఆరోపణలను కొట్టిపారేయడానికి నిర్మాత నాగ వంశీ లైన్ లోకి వచ్చారు. తాము ఎక్కడ కాపీ చేయలేదని క్లారిటీ ఇచ్చారు.
ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించారు. తాము కాపీ చేయలేదని, ఈ రెండు సినిమాల పోస్టర్లు ఒకేలా ఉండటం జస్ట్ కో ఇన్సిడెంట్ అని చెప్పాడు. తాము ముందుగానే పోస్టర్ రిలీజ్ చేసేటప్పుడు ఇలా ఉండాలని అనుకున్నామని, కానీ మరో మూవీ కూడా అలా ఉంటుందని అనుకోలేదని చెప్పారు. ఆయన ట్వీట్ కి రెస్పాన్స్ బాగా వస్తుంది. కొందరు దర్శక నిర్మాతలకు అండగా నిలుస్తున్నారు. గౌతమ్ చాలా టాలెంటెడ్ అని, అలా కాపీ చేయడనే నమ్మకం మాకుందని కొందరు కామెంట్ చేస్తుంటే, కాపీ చేసినవారు ఎవరూ తాము కాపీ చేశామని అంగీకరించరు అంటూ మరికొందరు కౌంటర్లు వేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా ప్రారంభానికి ముందే, వివాదంతో బజ్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు.