Begin typing your search above and press return to search.

గ‌ట్టిగా కొట్టామన్న వంశీ.. భీమ్లా టీమ్ లో జోష్‌

By:  Tupaki Desk   |   25 Feb 2022 10:00 PM IST
గ‌ట్టిగా కొట్టామన్న వంశీ.. భీమ్లా టీమ్ లో జోష్‌
X
అహంకారానికి ఆత్మాభిమానానికి మ‌ధ్య మ‌డ‌మ తిప్పిన యుద్ధం అంటూ త్రివిక్ర‌మ్ శైలి పంచ్ తో భీమ్లా నాయక్ కి చేసిన ప్ర‌చారం వృధా పోలేదు. ఈసారి గ‌ట్టిగా కొట్టాం అని చెప్పుకునే రేంజులోనే ఉంది ఈ సినిమా అంటూ అంతా భీమ్లా నాయ‌క్ పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టామినా.. ద‌గ్గుబాటి రానా పాత్ర‌లోని కొత్త‌ద‌నం వెర‌సి భీమ్లా నాయ‌క్ ని ఒక రేంజులో స‌క్సెస్ చేశాయ‌ని క్రిటిక్స్ స‌మీక్ష‌ల్లో ప్ర‌శంసించారు. ఏది ఏమైనా ఈ విజ‌యాన్ని అప్పుడే టీమ్ ఒక రేంజులో సెల‌బ్రేట్ చేసుకుంటోంది.

తాజా ట్వీట్ లో నిర్మాత నాగవంశీ ఈసారి గ‌ట్టిగా కొట్టాం! అంటూ ఆనందం వ్య‌క్తం చేశారు. ``మేం చెప్పినట్లుగా ఈసారి గట్టిగ కొట్టాం.. పేబ్యాక్ టైమ్ గుర్తుపెట్టుకోండి.. ఈసారి గట్టిగా కొట్టాం`` అని సితార వంశీ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసాడు.

భీమ్లా నాయక్ ను తెర‌కెక్కించిన విధానం తో ప‌వ‌న్- రానా అభిమానులు ఉప్పొంగిపోతుండగా తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఈ చిత్రం  ఫైనల్ కట్ ఎటువంటి ల్యాగ్ లేని విధంగా ఉంది. కొన్ని భాగాలలో మనం ల్యాగ్ గా భావించే అసలైన దానిలా కాకుండా అత్యుత్తమంగా ఎడిట్ చేశాం. దర్శకుడు సాగర్ చంద్ర-త్రివిక్ర‌మ్ కోరిన‌వ‌న్నీ అందించి వంశీ కూడా మూవీని వ‌ర్క‌వుట్ చేయ‌డంలో కీలక పాత్ర పోషించార‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి.

అయితే గ‌ట్టిగా కొట్టామ‌ని చెప్పుకునేది ఎప్పుడు? అంటే ఏపీలో 50 కోట్ల పెట్టుబ‌డుల్ని తిరిగి డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ర‌ప్పించ‌గ‌లిగిన‌ప్పుడే. భీమ్లాకి అన్నివైపుల నుంచి పాజిటివ్ స‌మీక్ష‌లు ఉన్నాయి కాబ‌ట్టి భారీ వ‌సూళ్ల‌ను సాధించ‌డం ఖాయ‌మే. కానీ ఏపీలో రూ.5 టికెట్ తో ఏమేర‌కు వ‌ర్క‌వుట‌వుతుందోన‌న్న ఆందోళ‌న నెల‌కొంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టికెట్ పంచ్ మామూలుగా లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. త‌మిళ‌నాడు త‌ర‌హాలో సినిమా వ‌ర్సెస్ రాజ‌కీయం ఇప్పుడు ఏపీలో వేడెక్కిస్తోంది. తొలి మూడు రోజుల్లో కేవ‌లం ఏపీ నుంచి భీమ్లా 50కోట్లు వ‌సూలు చేస్తాడా లేదా? అన్న‌ది ఫ‌జిల్ గానే మారింది.