Begin typing your search above and press return to search.

నెల జీతానికి పనిచేసిన స్టార్ డైరెక్టర్?

By:  Tupaki Desk   |   21 Nov 2018 2:30 PM GMT
నెల జీతానికి పనిచేసిన స్టార్ డైరెక్టర్?
X
డిమాండ్ ఎక్కువ ఉంటే రెమ్యూనరేషన్ ఎక్కువగా ఉంటుంది. అదే ఫ్లాపుల్లో ఉండి డిమాండ్ లేకపోతే ఆటోమేటిక్ గా ఫీజ్ తగ్గిపోతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. స్టార్ హీరోల విషయం అలా ఉండదు గానీ డైరెక్టర్ల విషయంలో మాత్రం ఇదే సూత్రం వర్తిస్తుంది. గతంలో స్టార్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో టాప్ రేంజ్ ను ఎంజాయ్ చేసిన ఒక దర్శకుడి పరిస్థితి కూడా అలానే ఉందట.

ఒక సినిమాకు రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయి నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక సినిమాకు నెల జీతానికి పనిచేయాల్సి వచ్చిందట. హ్యాట్రిక్ డిజాస్టర్లతో అయన మార్కెట్ బాగా దెబ్బతినడంతో తాజా చిత్రానికి నిర్మాతలు ఆయనకు రూ. 4.5 లక్షల నెల జీతాన్ని ఇచ్చారని సినీ వర్గాలలో గాసిప్పులు వినిపిస్తున్నాయి. సినిమా హిట్ అయితే మాత్రం ప్రాఫిట్స్ లో లాభాలు ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నారట. సినిమాకు నిర్మాతలు 23 కోట్ల బడ్జెట్ ఇచ్చారట.. అయినా దర్శకుడు మాత్రం రూ. 21 కోట్లలోనే సినిమాను కంప్లీట్ చేసి పెట్టాడట.

కానీ అయన దర్శకత్వం వహించిన గత మూడు చిత్రాలకంటే ఈ సినిమా మరింత పెద్ద డిజాస్టర్ అయింది. మొదటి షో నుండే బ్యాడ్ టాక్ రావడంతో సినిమా ఫలితం అందరికీ అర్థం అయిపోయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే ఆయనకు మరో సినిమా ఆఫర్ దొరకడం అసాధ్యమేనని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.