Begin typing your search above and press return to search.
టాక్ తేడా వస్తే... #PSPK25 కష్టమే
By: Tupaki Desk | 5 Oct 2017 4:21 AM GMTఫాంలో ఉన్న స్టార్లతో సినిమాలు తీస్తే ఓపెనింగ్స్ కి లోటుండదు. మార్కెటింగ్ తేలిక. బోలెడు లాభాలూ కళ్లజూడొచ్చు. సాధారణంగా ప్రొడ్యూసర్లకు ఉండే ఆలోచన ఇదే. కానీ బడ్జెట్ పెరిగిపోతున్న కొద్దీ ఛాన్సులు మారిపోతాయి. ఓపెనింగ్స్ వరకు లోటు లేకపోయినా సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే కలెక్షన్లు అమాంతం పడిపోతాయి. తాజాగా మహేష్ బాబు హీరోగా వచ్చిన స్పైడర్ సినిమా ప్రొడ్యూసర్లకు ఈ అనుభవం ఎదురైంది. ఇది మరో నిర్మాతను కలవర పరుస్తోందని టాలీవుడ్ లో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్.
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ 25వ చిత్రం #PSPK25 తెరకెక్కుతోంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇండస్ట్రీ రికార్డ్ అత్తారింటికి దారేది సినిమా వచ్చింది. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఇప్పుడు తీస్తున్న సినిమాకు నిర్మాత రాధాకృష్ణ (చిన్నబాబు) ధారాళంగా ఖర్చు పెడుతున్నాడు. అయితే సినిమా షూటింగ్ నత్తనడకన సాగుతుంటే ఖర్చేమో తడిసి మోపెడవుతోందట. పొలిటికల్ పరిస్థితుల కారణంగా ఇప్పుడు పవన్ షూటింగ్ కోసం ఫారిన్ వెళ్లడంపై అంత ఇంట్రస్ట్ గా లేడు. దీంతో రామోజీ ఫిలిం సిటీలోనే షూటింగ్ ఛేస్తున్నారు. అయితే రోజుకు రెండుమూడు సీన్లకే పేకప్ చెప్పేస్తున్నారని తెలుస్తోంది. దీంతో బడ్జెట్ ఇంకా పెరిగిపోతుండటం ప్రొడ్యూసర్ కు కలవరం కలిగిస్తోంది.
స్పైడర్ కు ప్రేక్షకుల్లో మిక్స్ డ్ టాకే వచ్చింది. కలెక్షన్లు బాగానే వచ్చాయి. కానీ భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఇంకా బ్రేక్ ఈవెన్ కు రాలేదు. రేపు పవన్ సినిమాకు కూడా టాక్ తేడా వస్తే అది కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ డౌట్ నిర్మాతను ప్రస్తుతం వేధిస్తున్న ప్రశ్న. మరి బడ్జెట్ ను కంట్రోల్ చేయడంపై త్రివిక్రమ్ దృష్టి పెడతాడో.. లేదో?