Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో నెపోటిజం కాస్త ఎక్కువే సుమీ

By:  Tupaki Desk   |   28 Jun 2020 2:30 PM GMT
టాలీవుడ్ లో నెపోటిజం కాస్త ఎక్కువే సుమీ
X
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య‌.. అంత‌కుముందు టాలీవుడ్ యంగ్ హీరో ఉదయ్ కిర‌ణ్ ఆత్మ‌హ‌త్య‌.. ఎంతో పెద్ద డిబేట్ కి తావిచ్చాయి. 34 వ‌య‌సుకే సుశాంత్ అంత‌ర్థానం అయితే 33 వ‌య‌సుకే ఉద‌య్ కిర‌ణ్ త‌నువు చాలించాడు. ఇవి రెండూ బ‌ల‌వ‌న్మ‌ర‌ణాలే. ఎవ‌రూ ఊహించ‌నివి కావ‌డంతో ఉలిక్కిపాటు త‌ప్ప‌లేదు.

అయితే ఆ రెండు మ‌ర‌ణాలు ఇరు ప‌రిశ్ర‌మ‌ల్లో హాట్ టాపిక్ అవ్వ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. ఇండ‌స్ట్రీ మాఫియాలే. న‌ట‌వార‌సులు కాని వాళ్ల ఎదుగుద‌ల‌కు ఎవ‌రూ సాయ‌ప‌డ‌రు ఇక్క‌డ .. పైగా న‌ట‌వార‌సుల కోసం ఇత‌రుల‌పై కుట్ర‌లు చేస్తార‌న్న తీవ్ర ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఖాన్ లు.. క‌పూర్లు.. భ‌ట్స్.. చోప్రాల‌ వంటి వారి కుట్ర‌లపై నెటిజ‌నుల్లో ఓ రేంజ్ డిబేట్ న‌డిచింది. సేమ్ టైమ్ టాలీవుడ్ లోనూ న‌ట‌వార‌స‌త్వం(నెపోటిజం) ఎగ్జిస్టెన్సీ పైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఇక్క‌డ అక్క‌డ కంటే ఎక్కువా? అంటే అవున‌నే అంటున్నారు నిర్మాత ప్ర‌స‌న్న‌కుమార్.

అయితే దీనిపై తెలుగు నిర్మాతల మండ‌లి కార్య‌ద‌ర్శి ప్ర‌స‌న్న‌కుమార్ మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. ఎన్టీఆర్-ఏఎన్నార్ స‌మ‌యం నుంచి న‌ట‌వార‌స‌త్వం ఉన్నా కానీ.. వార‌సులకు ఎంట్రీ కార్డ్ వ‌ర‌కే ప‌నికొచ్చింది కానీ.. ఆ త‌ర్వాత స్వ‌యంగా ఎద‌గాల్సి ఉంటుంద‌ని తెలిపారు. చిరంజీవి వార‌సుడు అయినా.. నంద‌మూరి వార‌సుడు అయినా కానీ సొంతంగానే ట్యాలెంటుతో ఎదిగార‌ని వెల్ల‌డించారు. ఇక్క‌డ బ‌ల‌వంతంగా రుద్దేస్తే ఎద‌గ‌డం సాధ్య‌ప‌డ‌ద‌ని.. అయితే ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌తో పోలిస్తే న‌ట వార‌స‌త్వం (నెపోటిజం) అనేది టాలీవుడ్ లో కాస్త ఎక్కువేన‌ని ఆయ‌న అన్నారు. అయితే ప‌రిశ్ర‌మ బ‌య‌టి నుంచి ప్ర‌తిభ వ‌స్తే తొక్కేయాల‌న్న ఆలోచ‌న స‌రికాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అంద‌రికీ ప్రోత్సాహం అవ‌స‌ర‌మని అన్నారు.

ర‌వితేజ‌- నానీ- ఈవీవీ వంటి వాళ్లు ఇండ‌స్ట్రీ వెలుప‌ల నుంచి వ‌చ్చి ఎదిగిన వారేన‌ని ఆయ‌న తెలిపారు. ఎద‌గాలంటే సొంత ట్యాలెంట్ చాలా ఇంపార్టెంట్ అని అన్నారు. ఇండ‌స్ట్రీలో మ‌నం బ‌తుకుతూ అంద‌రినీ బ‌త‌క‌నివ్వాలి! అన్న ప్ర‌కృతి సిద్ధాంతాన్ని ఆచ‌రిస్తేనే ఇక్క‌డ ఉంటారు. లేదంటే ప్ర‌కృతి దృష్టిలో దేవుడి దృష్టిలో అడ్డంగా దొరికిపోతార‌ని అన్నారు.