Begin typing your search above and press return to search.
ఫ్లాపుహీరోతో ప్రమోషన్స్.. బిజినెస్సు నిల్లు!
By: Tupaki Desk | 25 Nov 2018 1:30 AM GMTఏ సినిమాకైనా బిజినెస్ జరగాలంటే లీడ్ యాక్టర్ల ట్రాక్ రికార్డు బాగుండాలి.. లేదా డైరెక్టర్ అయినా సక్సెస్ లో ఉండాలి. ఈ రెండూ లేకపోతే ప్రోమోస్ తో సంచలనం సృష్టించాలి. త్వరలో రిలీజ్ కానున్న ఓ తెలుగు సినిమా పరిస్థితి ఏమాత్రం ఇలా లేకపోవడంతో బిజినెస్ సరిగా జరగడం లేదట.
దీనికి కారణం పైన చెప్పుకున్న కారణాలు మాత్రమే కాదట. నిర్మాతల రాంగ్ స్ట్రాటజీ దీనికి ముఖ్య కారణం అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో పేరుకి ఇద్దరు హీరోలు ఉన్నప్పటికీ వారికంటే హీరోయిన్ క్రేజ్ ఎక్కువ. ఆ హీరోల్లో ఒకరు ఇప్పటికే పూర్తిగా ఫేడ్ అవుట్ కాగా.. మరొకరు గత రెండేళ్ళుగా హిట్ లేక సతమతమవుతున్నారు. వారి ఫోటోలు పోస్టర్ పై చూస్తే జనాలు సినిమాను చూడడం సంగతి దేవుడెరుగు.. చూడడం వెంటనే మానుకుంటారు. అలాంటిది నిర్మాతలు క్రేజ్ ఉన్న హీరోయిన్ పేరుతో సినిమాను మార్కెట్ చేసుకోకుండా ముగ్గురూ లీడ్ యాక్టర్స్ తో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ రకం ప్రమోషన్స్ తో సినిమా ఫ్లాపు హీరో అకౌంట్ లో పడింది. దీంతో ఎవ్వరూ ఈ సినిమాను కొనడానికి ముందుకు రావడం లేదట.
హీరోయిన్ అసలు ఈ సినిమాను తన సినిమాలాగే ప్రమోట్ చేయాలని మొదట్లో కండిషన్ పెట్టిందట .. ఆ ఫ్లాపు హీరోను తీసుకోవడం తనకు అసలు ఇష్టం లేదట. ఇప్పుడు అలా జరగకపోవడంతో సినిమా నిర్మాతలకు అదే విషయం చెబుతోందట. కానీ ప్రమోషన్స్ లో ఆ ఫ్లాప్ హీరో కు ప్రాముఖ్యత ఇవ్వకపోతే అయన అప్సెట్ అవుతాడు కాబట్టి నిర్మాతలు ఈ సినిమాను లీడ్ యాక్టర్స్ అందరితో ప్రమోట్ చేయిస్తున్నారు. పరాయి భాషలో సూపర్ హిట్స్ తీసిన దర్శకుడు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చే సినిమా అయినా.. ప్రోమోస్ బాగున్నా.. ఈ జెనరేషన్ యూత్ కు కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉన్నా.. ఇప్పుడు సినిమాపై బజ్ లేక ఇబ్బంది పడడం చిత్రమైన విషయమే.