Begin typing your search above and press return to search.
డిజాస్టర్ ప్రొడ్యూసర్ ఈజ్ బ్యాక్..
By: Tupaki Desk | 23 July 2016 7:30 AM GMTఆర్.ఆర్. వెంకట్ అని కొన్నేళ్ల కిందట తెలుగులో వరుసగా భారీ చిత్రాలు నిర్మిస్తూ వార్తల్లో నిలిచిన ప్రొడ్యూసర్ గుర్తున్నాడు కదా. ముందు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో చిన్న సినిమాలు తీసిన వెంకట్.. ఆ తర్వాత ‘ఆర్.ఆర్ మూవీమేకర్స్’ బేనర్ మీద కిక్.. బిజినెస్ మేన్.. ఢమరుకం.. ఆటోనగర్ సూర్య లాంటి భారీ సినిమాలు నిర్మించాడు. ఐతే ‘కిక్’ మినహా ఏదీ ఆయనకు పెద్దగా డబ్బులు మిగల్చలేదు. ‘బిజినెస్ మేన్’ పర్వాలేదనిపించింది.
ఐతే క్రమ క్రమంగా టాప్ ప్రొడ్యూసర్ గా ఎదుగుతున్న టైంలో ఓవైపు సినిమాలు దెబ్బ తినడం.. మరోవైపు డిస్ట్రిబ్యూషన్ లో దారుణమైన నష్టాలు రావడంతో నిండా మునిగిపోయాడు వెంకట్. ఢమరుకం.. ఆటోనగర్ సూర్య లాంటి సినిమాలు చాన్నాళ్ల పాటు విడుదలకు నోచుకోక ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది. చివరికి ఎలాగోలా ఆ రెండు సినిమాలు రిలీజ్ చేయగలిగారు కానీ.. అవి రెండూ డిజాస్టర్లే అయ్యాయి. వెంకట్ కు ఇండస్ట్రీలో స్థానం లేకుండా చేశాయి.
ఐతే మూణ్నాలుగేళ్లుగా కనిపించకుండా పోయిన వెంకట్.. ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనుకుంటున్నాడట. కొందరు ఎన్నారైలతో కలిసి మళ్లీ సినిమాల నిర్మాణం మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడట వెంకట్. ఈసారి జాగ్రత్తగా.. పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగాలని.. మంచి కాంబినేషన్లు సెట్ చేయాలని ట్రై చేస్తున్నట్లు సమాచారం. మరి ఈసారైనా వెంకట్ సక్సెస్ అవుతాడేమో చూద్దాం.