Begin typing your search above and press return to search.
అజ్ఞాతవాసులను ఆదుకుంటున్న ప్రొడ్యూసర్
By: Tupaki Desk | 1 Feb 2018 12:59 PM GMTఎన్నో అంచనాల నడుమ విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. విడుదలైన మొదటి షోకే సినిమా దారుణమైన టాక్ అందుకోవడంతో రెండవ రోజు బారి దెబ్బ పడింది. సినిమా తీసింది అసలు దర్శకుడు త్రివిక్రమేనా అని అందరు ఆశ్చర్యపోయారు. సినిమా రిజల్ట్ ఏ ఒక్కరికి లాభాన్ని ఇవ్వలేకపోయింది. మొదటి సారి నిర్మాత రాధాకృష్ణ ఎప్పుడు చూడని నష్టాలను అజ్ఞాతవాసి వల్ల చూశాడు.
ఇకపోతే సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్స్ పరిస్థితి అయితే మరి దారుణం. పెట్టుబడి పెట్టిన దానిలో దాదాపు 60% వరకు నష్టపోయారు. సినిమా కనీసం మూడు రోజులు మంచి కలెక్షన్స్ తో నడిచినా ఎంతో కొంత లాభం వచ్చేది కానీ ఆ స్థాయిలో సినిమా ఆడలేకేపోయింది. ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా అజ్ఞాతవాసి నిలిచిపోయింది. అయితే ఆ నష్టాలను పూరించడానికి నిర్మాత రాధా కృష్ణ ఒక నిర్ణయానికి వచ్చారట. సినిమా మొత్తంగా 125 కోట్ల వరకు అమ్ముడు పోయింది కాబట్టి.. అందులో ఓ 25 కోట్ల వరకు రాధాకృష్ణ పంపిణీదారులు ఇవ్వనున్నాడట.
60% నష్టపోయిన వారికి ఒక 20% వరకు రికవర్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ కూడా తన రెమ్యునరేషన్ లో కొంత వరకు రిటర్న్ ఇవ్వడానికి సిద్దమయ్యాడట. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇచ్చాడా లేదే అనే విషయం తెలియదు. అయితే గతంలో ఆయన కాటమరాయుడు మరియు సర్దార్ సినిమాలకు వచ్చిన నష్టాన్ని భర్తీ చేయలేదు. ఇప్పుడు అజ్ఞాతవాసి విషయంలో నిర్మాత ఇలాంటి స్టెప్ వేయడం ఆనందించదగినదే.