Begin typing your search above and press return to search.

ఆ చిన్న నిర్మాత కావాలంటున్న నాని, చైతూ!

By:  Tupaki Desk   |   23 Nov 2022 6:30 AM GMT
ఆ చిన్న నిర్మాత కావాలంటున్న నాని, చైతూ!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఎప్పుడూ కూడా వారి స్థాయిని పెంచే విధంగా ఉంటుంది. అలాగే నిర్మాత అయినా సరే సక్సెస్ అందుకుంటేనే ఏ హీరోతో అయినా సినిమా చేసే ఛాన్స్ చాలా ఈజీగా దొరుకుతుంది. ఇక ఇటీవల కాలంలో చిన్న నిర్మాతలు కొందరు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వారు కొత్త దర్శకులకు మంచి అవకాశాలు కూడా ఇస్తున్నారు.

భారీ బడ్జెట్ సినిమాల కంటే కూడా తక్కువ బడ్జెట్లో నిర్మించే కంటెంట్ ఉన్న సినిమాలకు ఇప్పుడు ఎక్కువ స్థాయిలో క్రేజ్ అయితే అందుతుంది. ఇక రీసెంట్ గా వచ్చిన మసూద సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది.

ఆ సినిమా మొదటి వారంతరంలోనే టార్గెట్ పూర్తి చేసి ప్రస్తుతం ప్రాఫిట్ లో కొనసాగుతోంది. అయితే ఈ సినిమాలో నిర్మించిన రాహుల్ యాదవ్ నక్క ఇంతకుముందు కూడా ఒక రెండు చిన్న సినిమాలతో మంచి గుర్తింపును అనుకున్నాడు.

సుమంత్ తో చేసిన మళ్లీ రావా సినిమాతో పాటు ఏజెంట్ సాయి శ్రీనివాస్ సాత్రేయ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. చిన్న బడ్జెట్లో పెట్టిన పెట్టుబడికి ఆ రెండు సినిమాలు కూడా డబుల్ ప్రాఫిట్స్ అయితే అందించాయి. ఇక ఈ నిర్మాత రాహుల్ ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నాడు. ఇక ఆ లిస్టులో నాగచైతన్య నాని కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఇద్దరికి కూడా నిర్మాతతో మంచి స్నేహ సంబంధం ఉంది. అందుకే సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఇక ముందుగా ఈ హీరోతో చేస్తాడు అనే విషయంలో అయితే ఇంతవరకు సరైన క్లారిటీ ఇవ్వలేదు. వచ్చేవారం రాహుల్ తన తదుపరి సినిమా విషయంలో అధికారికంగా ఒక క్లారిటీ ఇవ్వనున్నాడు.

మళ్ళీ కొత్త దర్శకులతో లేదా తన ప్రొడక్షన్ లో చేసిన దర్శకులకు రాహుల్ ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఇక హీరోల విషయంలో ముందుగా అయితే నాగచైతన్య సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం నాని దసరా సినిమాతో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.