Begin typing your search above and press return to search.
రెండున్నర గంటల్లో మెంటల్ గా కనెక్టయ్యా
By: Tupaki Desk | 24 Nov 2017 5:29 AM GMTవిజయ్ దేవరకొండ హీరోగా గతేడాది వచ్చిన ఫెళ్లి చూపులు సైలెంట్ హిట్ కొట్టింది. ఓ రకంగా న్యూ ఏజ్ లవ్ స్టోరీస్ కు ఈ మూవీ దారి చూపించింది. కమర్షియల్ గానూ హిట్ సాధించి నిర్మాత రాజ్ కందుకూరికి కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత కాస్తంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు మెంటల్ మదిలో నిర్మించారు రాజ్ కందుకూరి. పెళ్లిచూపులు చిత్ర నిర్మాతగా తనపై కొన్ని అంచనాలు ఉంటాయని... అందుకే ఇప్పుడు తీసిన మెంటల్ మదిలో అంత ఆషామాషీగా ఏమీ ఓకే చేయలేదని అంటున్నారు ఆయన.
‘‘పెళ్లిచూపులు తర్వాత సినిమా కోసం దాదాపు 30 కథలు విన్నా. అవేవీ పెద్దగా నచ్చలేదు. మెంటల్ మదిలో తీసిన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కూడా మొదట చెప్పిన కథ ఇది కాదు. అతడు ఫస్ట్ ఓ కథతో నా దగ్గరకు వచ్చాడు. అంతా విన్నా అందులో కమర్షియల్ టచ్ లేదనిపించింది. అదే మాట అతడితో చెప్పా. వారంలో కొత్త కథ రాసి నా దగ్గరకు తెచ్చాడు. రెండున్నర గంటలపాటు కథ నెరేట్ చేశాడు. ఈసారి బాగా కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేశాను. సినిమా గురించి ప్రొడ్యూసర్ సురేష్ బాబుకు కూడా చెప్పాను. ఆయనకు కూడా స్టోరీ నచ్చడంతో కలిసి ఈ సినిమా తీశామంటూ’’ మెంటల్ మదిలో సినిమా తీయడం వెనుక ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొచ్చారు నిర్మాత రాజ్ కందుకూరి.
శ్రీవిష్ణు.. నివేద పేతురాజ్ హీరో హీరోయిన్లుగా మెంటల్ మదిలో చిత్రం రూపొందింది. ఈ ఏడాది ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో విషాద ప్రేమికుడిగా కనిపించిన శ్రీవిష్ణు ఇందులో గందరగోళం నిండిన ప్రేమికుడిగా కనిపించనున్నాడు. వివేక్.ఆర్.ఆత్రేయ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.