Begin typing your search above and press return to search.

చినబాబూ.. మళ్లీ ఎన్నేళ్లకిలా..

By:  Tupaki Desk   |   24 Nov 2017 7:25 AM GMT
చినబాబూ.. మళ్లీ ఎన్నేళ్లకిలా..
X
హీరో-డైరెక్టర్.. హీరో-హీరోయిన్.. హీరో-ప్రొడ్యూసర్ ఇలా కాంబినేషన్స్ ఎలా ఉంటాయో.. డైరెక్టర్-ప్రొడ్యూసర్ కాంబో కూడా క్రేజీగానే ఉంటుంది. దర్శకుడు త్రివిక్రమ్ కూడా.. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ అధిపతి అయిన రాధాకృష్ణతో సినిమా చేసేందుకు బాగా ఇష్టపడతాడు. ఈ ప్రొడ్యూసర్ కి కూడా మాటల మాంత్రికుడితో బాగానే సెట్ అయింది. అందుకే గత కొన్నేళ్లుగా ఇతర చిత్రాలకు సహ-నిర్మాత గానో.. ప్రెజెంటర్ గానో తప్ప నేరుగా వేరే దర్శకుడితో సినిమా తీసిన దాఖలాలు లేవు.

రీసెంట్ గా మహానుభావుడు మూవీతో దర్శకుడు మారుతి గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు. తన తర్వాతి చిత్రాన్ని అక్కినేని నాగచైతన్యతో చేసేందుకు ఈ దర్శకుడు రెడీ అవుతున్నాడు. ఈ శనివారమే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయని తెలుస్తోంది. నటీనటులతో పాటు.. దాదాపు యూనిట్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారట. షూటింగ్ ప్రారంభం అయేందుకు కొన్ని నెలల సమయం ఉన్నా.. ఈ సినిమాకు నిర్మాతగా ఎస్. రాధాకృష్ణ వ్యవహరించనుండడం విశేషం.

చినబాబుగా గుర్తింపు పొందిన ఈ ప్రొడ్యూసర్.. త్రివిక్రమ్ తో కాకుండా మారుతి దర్శకత్వంలో మూవీ చేస్తుండడం చెప్పుకోవాల్సిన విషయం. ఇక ఈ సినిమాకి శైలజా రెడ్డి అల్లుడు అనే పేరును ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. శైలజా రెడ్డి పాత్ర కోసం రమ్యకృష్ణను కానీ.. శ్రీదేవిని గానీ తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.