Begin typing your search above and press return to search.
డ్రగ్స్ దందాలో కిరికిరిపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 6 Sep 2021 4:22 AM GMTటాలీవుడ్ సెలబ్రిటీలపై ఈడీ విచారణ సర్వత్రా వేడి పెంచుతున్న సంగతి తెలిసిందే. 2017 సంచలనాత్మక డ్రగ్స్ కేసు టాలీవుడ్ ను ఇప్పటికీ షేక్ చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో హవాలా మార్గాల ద్వారా డబ్బు తరలింపు పై విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా పూరీ జగన్నాధ్ - ఛార్మి - రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఏదైనా మనీలాండరింగ్ లో పాల్గొన్నారో లేదో తెలుసుకోవడానికి ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించింది. వీరందరినీ దాదాపు 8-9 గంటలు పైగా ఈడీ విచారించడం తెలిసినదే.
ఇదే విషయంపై నిర్మాత నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిసారీ డ్రగ్స్ కేసులో సినీప్రముఖుల పేర్లే ఎందుకు వినిపిస్తున్నాయి? ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఆలోచించాలి. దీనికి సంబంధించిన వాస్తవాలను గుర్తించడానికి సమగ్ర దర్యాప్తు జరగాలి అని నట్టి కుమార్ అన్నారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి కొంతమంది నిర్వాహకులను విచారించాలి. ఈ నిర్వాహకుల బ్యాంక్ లావాదేవీలపై సంబంధిత అధికారులు ఆరాలు తీస్తే వారు డ్రగ్స్ వ్యాపారానికి సంబంధించిన ఆధారాలను కనుగొనవచ్చు`` అని ఆయన అన్నారు.
ఈ సందర్భంలోనే ఆయన హీరోల పారితోషికాలపైనా విరుచుకుపడ్డారు. తమ సొంత లాభాల కోసం నటుల రెమ్యూనరేషన్ లను పెంచడం ద్వారా నటుల నిర్వాహకులు కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. డ్రగ్స్ లో ఉన్న ఎవరినీ వదిలిపెట్టకూడదని అన్నారు.