Begin typing your search above and press return to search.

సినిమా రిలీజవలేదని ప్రాణం తీసుకోబోయాడు

By:  Tupaki Desk   |   20 Feb 2016 6:53 AM GMT
సినిమా రిలీజవలేదని ప్రాణం తీసుకోబోయాడు
X
కోట్లు పెట్టి తీసిన సినిమా విడుదలకు నోచుకోకపోతే నిర్మాతలు పడే ఆవేదన అంతా ఇంతా కాదు. అలా తీవ్ర మనోవేదనకు గురైన ఓ కన్నడ దర్శక నిర్మాత ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. బెంగళూరులోని నందినీ లేఔట్ ‌కు చెందిన శశికుమార్ రెండేళ్ల కిందట కొత్త కథానాయకుడు సందీప్‌ తో ‘హాఫ్ మెంటల్’ అనే సినిమా మొదలుపెట్టాడు. ఈ చిత్రానికి అతనే దర్శకుడు, నిర్మాత. ఐతే సినిమా పూర్తయి ఏడాది గడిచినా ఇప్పటిదాకా అది విడుదలకు నోచుకోలేదు. ‘హాఫ్ మెంటల్’ను రిలీజ్ చేయడానికి శశికుమార్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

దీంతో గురువారం కారులో ఇంటి నుంచి బయల్దేరిన శశికుమార్ కామాక్షిపాళ్య బస్టాండు సమీంపలోవాటర్్ బాటిల్లో పురుగుల మందు కలుపుకొనితాగాడు. కొద్దిసేపటికి భార్య ఫోన్ చేయగా శశికుమార్ అదోలా మాట్లాడాడు. దీంతో ఆమె శశికుమార్ స్నేహితులకు సమాచారమిచ్చింది. వాళ్లు హుటాహుటిన శశికుమార్ ఉన్న చోటికి చేరుకుని.. అతణ్ని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్సచేసి శశికుమార్ ను ప్రాణాపాయం నుంచిబయటపడేశారు. తన సినిమాను విడుదల చేయడానికి మరింత డబ్బు అవసరమని.. ఉన్న డబ్బులన్నీ ఖర్చయిపోయాయని.. అందుకే ఆత్మహత్యకు ప్రయత్నించానని శశికుమార్ తెలిపాడు.